
నాకు ఓ అమ్మ కనిపించింది. ఆమె ప్రతి పలుకులో ప్రేమ తొణికిసలాట నాకు వినిపించింది. ప్రతి ఒక్కరిలో తన పాపను చూసుకునే, కనుపాపను చేసుకునే తత్వం నాకు నచ్చింది. ఆ అమ్మ ఏతలే కాదు, రాతలూ నాకు అబ్బురమనిపించాయి. నా మనసును కరిగించాయి. ఆ ఆనందం నాతో పాటు నా తోటి బ్లాగరులకూ పంచాలనుకున్నాను. బ్లాగు ప్రారంభించమన్నాను. కానీ సున్నితంగా తిరస్కరించారు. నేనే అమ్మ పేరుతో బ్లాగులో రాయాలని అనుకున్నాను. ఆప్రయత్న రూపమే "అమ్మ మనస్సు".
ఈ శీర్షికలో నేను రాసేవన్నీ ఆ అమ్మ సీతమ్మ రాతలే. చదివి ఆనందిస్తారు కదూ.. :)
ఈ శీర్షికలో నేను రాసేవన్నీ ఆ అమ్మ సీతమ్మ రాతలే. చదివి ఆనందిస్తారు కదూ.. :)
మొదటగా మన బ్లాగర్ "క్రియేటివ్ కుర్రోడు మాధవ్" ని గురించి అమ్మ రాసిన కవిత...
అమూల్యం
ప్రపంచపు సంపదనంతా ప్రోగుచేసినా
నీ గుప్పెడు గుండెలోని ఆత్మీయతకు సాటి రాదు
నీ కళ్లలో కరుణే కానీ కల్తీ లేనే లేదు
స్ఫటికపు రాళ్లపై ప్రవహించే నీటిలా
అద్దమంటి మనసుతో
గరళం మింగింనా అమృతం అందించే
ఆర్ద్రత నీ పలుకుల్లో
స్వచ్ఛతకు మారు పేరు నువ్వు
సుమ సమీరం లాంటి చల్లని
నీ చేతి స్పర్శలో అమ్మ లాలిత్యం
ఎప్పుడో చంటి పాపాయిని
గతజన్మలో దూరం చేసుకున్నానేమో
ప్రేమతో-అమ్మ
ప్రపంచపు సంపదనంతా ప్రోగుచేసినా
నీ గుప్పెడు గుండెలోని ఆత్మీయతకు సాటి రాదు
నీ కళ్లలో కరుణే కానీ కల్తీ లేనే లేదు
స్ఫటికపు రాళ్లపై ప్రవహించే నీటిలా
అద్దమంటి మనసుతో
గరళం మింగింనా అమృతం అందించే
ఆర్ద్రత నీ పలుకుల్లో
స్వచ్ఛతకు మారు పేరు నువ్వు
సుమ సమీరం లాంటి చల్లని
నీ చేతి స్పర్శలో అమ్మ లాలిత్యం
ఎప్పుడో చంటి పాపాయిని
గతజన్మలో దూరం చేసుకున్నానేమో
ప్రేమతో-అమ్మ