నిదుర లేవగానే మంచి మంచి ఆలోచనలు చేయడం వలన ఆరోజంతా ఉత్సాహంగా ఉంటుంది. అటువంటి మంచి ఆలోచనలు కల్పించే ప్రయత్నమే ఈ ప్రాతస్స్మరణ శ్లోకాలు చేస్తున్నాయి. పొద్దున్న మెలకువరాగానే ఈ క్రింది శ్లోకాలు మనసులోనే చదువుకుంటూ వాటి భావాన్ని ధ్యానం చేసే ప్రయత్నం చేయాలి.
మన జన్మకు కారకులైన మాతా పితరులను స్మరించవలెను. తరువాత మన ఙ్ఞాన దాతలైన గురువులను ధ్యానించవలెను.
ఇక ఉదయాన్నె చదువలసిన శ్లోకాలు చాలా ఉన్నప్పటికీ కొన్ని ప్రసిద్ద శ్లోకాలను ఇక్కడ రాస్తున్నాను. వీటిని పఠించుట వలన దుస్స్వప్న నాశనము, కలినాశనము,మహాపాతక నాశనము కలిగి మంగళకరమగును.
౧. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవేనమః
౨. అఙ్ఞాన తిమిరా2౦ధస్య ఙ్ఞానా2౦జన శలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః
౩. ఉత్తిష్ఠోత్తిష్ఠ విశ్వేశ ఉత్తిష్ఠ వృషభధ్వజ
ఉత్తిష్ఠ గిరిజా కాన్త త్రైలోక్యం మంగళం కురు
౪. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా
౫. శారదా శారదా2౦భోజవదనా వదనా2౦బుజే
సర్వదా సర్వదా2స్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్
౬. యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయోస్సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళమ్
౭. లక్ష్మీ నివాస నిరవద్యగుణైక సింధో, సంసార సాగర సముత్తరణైకసేతో
వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య, శ్రీ వేంకటా2చలపతే తవసుప్రభాతమ్
౮. బ్రహ్మ మురారిః త్రిపురాన్తకారిః భాను శశీ భూమిసుతో బుధశ్చ
గురుశ్చ శుక్రః శని రాహు కేతవః కుర్వన్తు సర్వే మమ సుప్రభాతమ్
౯. భృగుర్వసిష్ఠః క్రతురంగిరాశ్చ మనుః పులస్త్యః పులహశ్చ గౌతమః
దాల్భ్యోమరీచిః చ్యవనో2థ దక్షః కుర్వన్తు సర్వే మమ సుప్రభాతమ్
౧౦. సనత్కుమారశ్చ సనన్దనశ్చ సనాతనో2ప్యాసురి సింహళౌ చ
సప్త స్వరాః సప్త రసాతలా కుర్వన్తు సర్వే మమ సుప్రభాతమ్
౧౧. సప్తా2ర్ణవాః సప్తకులా2చలాశ్చ సప్తర్షయో ద్వీపవనాని సప్త
భూరాది కూర్మో భువనాని సప్త కుర్వన్తు సర్వే మమ సుప్రభాతమ్
౧౨. పృథ్వీ సగన్ధా సరసాస్తథా2పః స్పర్శీ చ వాయుర్జ్వలితం చ తేజః
నభః సశబ్దం మహతా సహైవ కుర్వన్తు సర్వే మమ సుప్రభాతమ్
౧౩. ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక వ్యాసా2౦బరీష శుక శౌనక భీష్మదాల్భ్యాన్
రుక్మాంగదా2ర్జున వసిష్ఠ విభీషణా22దీన్ పుణ్యానిమాన్ పరమభాగవతాన్ స్మరామి
౧౪. పుణ్యశ్లోకో నలో రాజా పుణ్యశ్లోకో యుధిష్ఠరః
పుణ్యశ్లోకాచ వైదేహీ పుణ్యశ్లోకో జనార్దనః
౧౫. బ్రహ్మాణం శంకరం విష్ణుం యంమం రామం దనుం బలిం
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మహా పాతక నాశనమ్
౧౬. అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా
పంచకం తాః స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్
౧౭. గాయత్రీం తులసీం గంగాం కామధేనుమరుంధతీమ్
పంచ మాతౄః స్మరేన్నిత్యం మహా పాతక నాశనమ్
౧౮. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్యచ
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్
౧౯. మూకం కరోతి వాచాలం, పంగుం లంఘయతే గిరిమ్
యత్కృపా తమహం వందే పరమానందమాధవమ్
౨౦. హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
౨౧. మహాదేవ మహాదేవ మహాదేవ దయానిధే
భవానేవ భవానేవ భవానేవ గతిర్మమ
౨౨. కృష్ణః కరోతు కళ్యాణం కంసకుంజరకేసరీ
కాళిందీజలకల్లోలం కోలాహల కుతూహలీ
౨౩. కరాగ్రె వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ
కరమూలే స్థితో బ్రహ్మా ప్రభాతే కర దర్శనమ్
౨౪. ఆత్మాత్వం గిరిజామతిః పరిజనాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వాగిరః
యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో! తవా2రాధనమ్
౨౫. ఇత్థం ప్రభాతే పరమం పవిత్రం, పఠేత్ స్మరేద్వా శృణుయాచ్ఛ తద్వత్
దుస్స్వప్న నాశత్విహ సుప్రభాతం, భవేచ్చ నిత్యం భగవత్ ప్రసాదాత్
ఇంకా భూమి ప్రార్థన చేస్తూ, స్వాసను పీలుస్తూ, కుడి కాలు మొదటగా నేలపైమోపాలి.
శ్లో.. సముద్రవసనే! దేవి! పర్వత స్తనమండలే!
విష్ణుపత్ని! నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే
రోజూ ఒకేలా లేవడం కన్నా కొన్ని రోజులు ఈ శ్లోకాలు చదివే ప్రయత్నం చేసి చూడండి. ఆ రోజులోని తేడా ఏమిటో మీకే తెలుస్తుంది.
Thursday, December 16, 2010
Wednesday, December 15, 2010
బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి విధులని ఆచరించాలి?
బ్రాహ్మణుడైన వాడు నిత్య ఆచార వంతుడై, అనుష్ఠాన పరుడై, స్వాధ్యాయమును సాగించుచూ క్రొత్త విషయములను వేదములనుండి గ్రహించుచూ, తనకు తెలిసిన వాటిని తెలియని వారికి తెలుపుచూ ఉండవలెను. తాను ఎంత శ్రమకు ఓర్చి అయినను నిత్యానుష్ఠాన,దేవతార్చనాదులను ఆచరించ వలెను. ఆవిధముగా ఆచరించినపుడు మాత్రమే అతడు "భూసురుడు" అన్న మాటకు తగిన వాడు అవుతాడు. అటులకాని వాడు భూలోకమున దేవతల రూపముధరించిన కలిపురుషుడే కానీ మరొకడు కాదు.
ఇక బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి చేయాలి అన్నది చాలామందికి సందేహము. అది కొంత తీర్చే ప్రయత్నము చేద్దాము.
ప్రొద్దున్నే నిద్రనుండి ౪ గం.లకు లేవాలి. ప్రాతస్మరణము,శుభవస్తు దర్శనము చేసి, కాలకృత్యములు తీర్చుకుని, నదికి గానీ తటాకమునకు గానీ వెళ్లిస్నానమాచరించవలెను.
౧. స్నానము
౨.సంధ్యోపాసనము
౩.జపాదికము
౪.ఔపాసనము
౫. పంచాయతన దేవతార్చనము
౬.బ్రహ్మయఙ్ఞము
౭. వైశ్వదేవము
౮. పంచాయతనమునకు పునః పూజ
౯. అతిథిపూజ( భోజనము)
౧౦.భోజనము
౧౧.సత్సంగము
౧౨. సాయం సంధ్యావందనము
౧౩. సాయమౌపాసనము
౧౪. రాత్రి వైశ్వదేవము
౧౫. రాత్రి దేవతార్చనము
ఇవిగాక స్వాధ్యాయము, అధ్యాపనము, యజనము-యాజనము, దానము-ప్రతిగ్రహణము,నైమిత్తికము
లు,శాంతులు, నిత్య లౌకిక కృత్యములు మొదలైనవి నిత్యము చేయాలి.
అధ్యాపనం అధ్యయనం యజనం యాజనం తథా
దానంప్రతిగ్రహణం చైవ బ్రాహ్మణానామకల్పతె
మరింత వివరంగా త్వరలో రాసేప్రయత్నం చేస్తాను.
అధ్యాపనం అధ్యయనం యజనం యాజనం తథా
దానంప్రతిగ్రహణం చైవ బ్రాహ్మణానామకల్పతె
మరింత వివరంగా త్వరలో రాసేప్రయత్నం చేస్తాను.
Subscribe to:
Posts (Atom)