Friday, April 3, 2015

రేపు చంద్ర గ్రహణ సమయాలు



    రేపు అనగా ది: 04-04-2015 శనివారంచైత్రపూర్ణిమ నాడు హస్తానక్షత్రమున కన్యారాశిలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించు చున్నది. భారత కాలమానం ప్రకారం (స్పర్శ) సా.గం.3-46 ని. నుండి  (మోక్షం) రా.గం.7-15ని. వరకు ఈగ్రహణం ఉన్నప్పటికీ భారతదేశంలో స్వల్ప సమయం మాత్రమే గోచరించును. హైదరాబాదు నందు సా.గం 6-32ని. నుండి రా.7-15ని. వరకు గ్రహణం కనిపించును.

     హస్త నక్షత్రం వారు, కన్యారాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఆదివారం ఉదయాన్న గ్రహణ శాంతి కొరకు వెండి పాముపడగ, చంద్ర బింబము పంచామృతములతో అభిషేకించి – మినుములు, బియ్యములతో వస్త్రములో ఉంచి బ్రాహ్మణునకు దానము ఇవ్వవలెను. ఆబ్దీకములు పగటి పూట యథా ప్రకారముగా జరుపుకొనవచ్చును. మధ్యాహ్నము నుండి దేవాలయములు మూసివేయ వలెను. 

వివిధ ప్రదేశాలలో చంద్ర గ్రహణ సరి యగు సమయాలకొరకు క్రింది చిత్రపటాలను చూడగలరు.