Wednesday, September 29, 2010

గోవులను కష్టపెట్టే పూజలు ఆపండి మహాప్రభో!

పూర్వం ఏ పూజ చేసినా ముందుగా గోపూజ చేసిగానీ మొదలు పెట్టేవారు కాదు. నేడు ప్రతీ పూజలో కాకపోయినా కొన్ని ప్రత్యేకమైన పూజలలో మనం  కూడా గోపూజ చేస్తున్నాం. కానీ నాటికీ నేటికీ గోపూజలో హస్తిమశకాంతరం ఉంది. పూర్వం గోవులను బట్టే వారి సంపదను లెక్కించేవారు. ప్రతీ వారికీ గోవులు ఉండేవి. ఉదయాన్నే లేచి వాటిని పూజించి మిగతా కృత్యాలు చేసుకోవడం ఆచారంగా ఉండేది.నేడు మనలో నూటికి తొంభైతొమ్మిది మందికి గోవులు లేవు. మనకు ఆ పూజ ఆచారమూ పోయింది. సరే అంతవరకూ బాగానే ఉంది.






 గృహప్రవేశాలప్పుడు ఇంటిలోనికి ముందుగా తాముపెంచుకునే గోవుని పంపి తాము ప్రవేశించడం ఆచారంగాఉండేది. నేటికీ ఆ ఆచారం ఉంది. కాకపోతే నేడు ఆ గోవులు మనవి కావు. ఎక్కడో ఎవరో పెంచుకునే ఆవులను మనం తెప్పించుకుంటాం. ఇక ఆ ఆవు చేత సర్కస్ చేయిస్తాం. పూర్వం ఇళ్లన్నీ మట్టి నేలలతో ఉండేవి. ఇప్పుడు మరి మనవి పాలరాతి నేలలు. చక్కగా నున్నగా పాలిషింగ్ పట్టించి నీళ్లు పడితే జారిపడే విధంగా ఉంటాయి. ఆ నేలమీద మనమే అప్రమత్తంగా ఉంటే జారిపడతాం. అలాంటిది అలవాటు లేని ఆవూ,దూడలను మెట్లు ఎక్కించి, ఆ ఇంట్లో కాళ్లు జారుతూన్నా ఇల్లంతా తిప్పించి, భజంత్రీలు, బంధుగణాలతో నానా గోలా చేసి దానిని భయపెట్టి ఆ భయంతో అది పేడ వేస్తే ఆహా ఇల్లు పవిత్రమైందని భావించి మనం గృహప్రవేశం చేసుకోవడం అవసరమా!?

 దానికంటే చక్కగా ఓ వెండి గోవును పళ్లెంలో పెట్టుకుని లోపలికి ప్రవేశించండి. గోవు చాలా పవిత్రమైనది. దానిని పూజ అనే పేరుతో నేడు మనం నానా హింసలూ పెడుతున్నాం. ఇదంతా తెలిసి చేస్తున్నాం అనికాదు. ఎవరూ ఆలోచించడం లేదు అంటున్నాను. గోవు బాధ పడకుండా ఇంట్లోకి ప్రవేశించాలి అంటే అక్కడివాతావరణం సహజంగా ఉండాలి. కొత్త వాతావరణంలో కొత్తవారిని చూస్తే అవి బెదురుతాయి. పైగా భజంత్రీలు, బంధువులు ఉంటారు. ఇంత మందిని ఒకేసారి చూసి కూడా అవి చాలా భయపడతాయి. ఇక ఆ గ్రానైట్ నేలమీద నడవడం కూడా వాటికి చాలా కష్టంగా ఉంటుంది. కనుక కాస్త ఆలోచించి ఈ ఆచారం నేటికి సరికాదని తెలుసుకోండి. కొంతమంది అపార్ట్ మెంట్లు కూడా ఎక్కించేస్తున్నారు. దయచేసి ఆపని చేయకండి. పుణ్యం రాకపోగా పాపం మూట కట్టుకోవలసి వస్తుంది. ఒక వేళ పెద్దలు, పురోహితులు ఎవరైనా అదేంటి గోవులేకుండా ఎలా ? అని ప్రశ్నిస్తే ఈ కారణాలన్నీ చెప్పి సున్నితంగా తిరస్కరించండి. నాకు తెలిసి పురోహితులు చాలా మందికి ఈ స్పృహ ఇప్పటికే కలిగింది. యజమానులు కూడా అర్థం చేసుకో గలిగితే గోవును బాధపెట్టిన పాపం తగలకుండా ఉంటుంది.

 ఇక గోపూజను పూర్తిగా వదిలిపెట్టనవసరం లేదు. గృహప్రవేశమప్పుడు దగ్గరలో ఉన్న గోవును పిలిపించండి. కానీ ఇల్లంతా తిప్పే పని మాత్రం మానండి. చక్కగా గోవును పూజించండి. ఈ పూజా క్రమంలో కూడా ఆ గోవు ఒళ్లంతా పసుపు,కుంకుమ చల్లకుండా పాదాలకు, నుదుటివద్ద, తోకకు మాత్రమే కాస్త పసుపు రాసి పూజించండి. మనం కూడా పసుపు మంచిదని ఒళ్లంతా చల్లుకోం కదా!? పాదాలకు రాసుకుంటారు. అలాగే ఆవుకు కూడా.





ఇక ఆవుకు బిడ్డపుట్టేటప్పుడు ప్రదక్షణాలు కూడా దానిని భయపెట్టేవిధంగా ఉంటున్నాయి. కాస్త ఆవిషయంలో కూడా ఆలోచించండి. ఈ మధ్య మరీ మూర్ఖంగా ఆవుకు ఆరుపాదాలు ఉన్నాయి అంటూ వాటిని ఇల్లిల్లూ తిప్పి దానిపేరుతో డబ్బులు దండుకునే వారు తయారయ్యారు. అటువంటి వారిని ప్రోత్సహించకండి. చేతనైతే నాలుగు చివాట్లు పెట్టండి. ఆ ఆవులను పూజ పెరుతో ఒక చిన్న లారీ లాంటి దానిలో పెట్టుకుని తిప్పడం ఎక్కడో చూశాను. రెండు చేతులున్న మనకే లారీలో నుంచుని ప్రయాణించడం కష్టమైన పని. ఆ లారీ దూకుడుకు నుంచోలేక క్రింద కూర్చుంటాం. అలాంటిది చేతులు లేని ఆవులకు ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. దాని ప్రాణం ఎంత హడలిపోయి ఉంటుందో ఒక్క సారి ఆలోచించండి. అలా వాహనాలలొ తిప్పి డబ్బులడిగే వారిని తప్పకుండా ఖండించాలి. కావాలంటే పోలీస్ కంప్లెయింట్ ఇస్తామని బెదిరించాలి.

ఆవుకు ఆరు కాళ్లు ఉంటే చాలా మంచిదని, దానికి పూజించడం చాలా విషేషమని మన నమ్మకం. ఇది నూటికి నూరుపాళ్లూ నిజం. కానీ దానివెనుక కారణాలు ఆలోచించాలి మనం. నోరులేని, మనకంటే నిమ్న స్థాయిలోని ప్రతీ జీవినీ మనం దాదాపుగా పూజిస్తాం. ఆఖరికి కుక్కను కూడా కాల భైరవుడంటూ పూజిస్తాం. అలా ఎందుకంటే వాటికి రక్షణ కల్పించాలని. వాటికి కూడా జీవించే హక్కును కల్పించాలని. మనం భక్తి పేరుతో నైనా వాటిని రక్షిస్తామని. గోవు ఎవరికీ హాని చెయ్యని సాధుజంతువు. పైగా అది తినేది గడ్డి, ఇచ్చేది తియ్యటి పాలు. అవి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆవు మూత్రం, పేడ కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము, పేడ ఈ ఐదింటిని గో పంచకము అంటారు. విషేష పూజలలో వీటిని పూజించి సేవించడం నేటికీ ఉంది. అటువంటి ఆవును రక్షించాలని దానికి పూజలలో ప్రథమ స్థానం ఇచ్చారు. ఏదైనా ప్రయోజనం ఉన్నంత సేపే మనం దానిని రక్షిస్తాం. మన స్వార్థ గుణంతో ఏ ఉపయోగం లేదని, అంగవైకల్యంతో జన్మించిన ఆవులను సంరక్షించడం కష్టమని వాటిని ఎక్కడ వదిలేస్తామో అన్న చింతనతో అటువంటి వాటిని విషేషంగా పూజించాలన్న నియమం పెట్టి ఉండవచ్చు. అలాంటిది వాటిని పూజపేరుతో ఊరూరూ తిప్పుతూ మరింత బాధ పెట్టడం చాలావిచారకరం. అందరూ ఈ విధానాలను ఖండించాలి.

 గోవులను బాధపెట్టకుండా పూజించే వీలులేకపోతే ఆ పూజలు మానండి. నష్టమేమీ లేదు. వాటిని తెలిసికానీ తెలియక కానీ ఏవిధంగానూ బాధ పెట్టడం మంచిదికాదు.

33 comments:

  1. చక్కని టపా. ప్రస్తుథ కాలమానానికీ, ఆచారాలు మొదలయినప్పటి పరిస్థితికీ తేడా ఆలోహించకుండా ఎదో విధంగా ఆచారాలు పాటించాలి అనుకునేవారి కళ్ళు తెరిపించే విధంగా చెప్పారు.

    ReplyDelete
  2. చాలా బాగా చెప్పారు విజయ్ శర్మగారు...

    ReplyDelete
  3. మంచి విషయాలు తెలియచేసారు. మీరు చెప్పిన విషయాలు తప్పక గుర్తు పెట్టుకోవాలి.

    ReplyDelete
  4. విష్ణుమూర్తి దశావతారాలలో పంది అవతారం ఒకటి కదా.
    (పంది అని తెలుగులో ఎందుకు అనకూడదు- వరాహం అనే సంస్కృత పదమే ఎందుకు వాడాలి)
    ఆ పందిని ఎందుకు పూజించడం లేదు?

    ఆవు పాలిస్తుంది - సరే గేదెలు కూడా పాలిస్తాయి కదా
    మనం రోజూ తాగుతున్నది గేదె పాలే కదా
    మరి గేదెను ఇలాంటి శుభకార్యాలకు ఎందుకు వినియోగించ కూడదు....
    ఎవరైనా వివరంగా చెప్తారా?
    -భరత్

    ReplyDelete
    Replies
    1. పంది వేరు వరాహం వేరు. వీధిలో తిరిగే పిల్లి కి అడవిలో సంచరించే పెద్దపులికి ఉన్నంత తేడా. (రెండూ ఒకే జాతి కి చెందినా)
      ఎందుకూ పనికిరాని విషయసుఖాలను ఆస్వాదించే వారిని మలం తినే పంది తోను,
      మోక్ష సాధన లో జన్మ జన్మల నుండి కూరుకు పోఇన ఐహిక వాంచలను కూకటి వేళ్ళతో పెళ్ళగించి వేసే ఉత్తమ సాధకుని వరాహం (కోరలు గలది) తో పోల్చబడినది.
      తేడా కోరలలో మాత్రమేకాదు వాటి ఆహార విహారాలలో, గుణాలలో,ఎంతో తేడా ఉంది. గమనింపగలరు.

      Delete
  5. మీ బ్లాగు ఎప్పటి నుండో చూస్తూ ఉన్నా కానీ కామెంటలేదనుకుంటా ఇప్పటివరకు. చాలా ఆలోచింపచేసే పోస్టు అండీ.మీరన్నట్లు గోవులు బెదిరిపోతున్నాయి పాపం గ్రుహప్రవేశం లాంటి సమయాలలో ఆ హడావిడీ చూసి.
    ఆరు కాళ్ళ గోవుల గురించి కూడా బాగా చెప్పారు.

    ReplyDelete
  6. ఆలోచింపజేసే టపా..

    ReplyDelete
  7. విజయ్ శర్మ గారూ చాలా చక్కగా చెప్పారు.ఆచారాలను తు చ తప్పకుండ పాటించాలని చూస్తున్నారు కాని వాటి అంతరార్థాన్ని తెలుసుకోవట్లేదు ఎవరూ. లారీలలో కుక్కి కబేళాలకు పంపిస్తున్న ఆవులు గేదెలను చూస్తె చాల బాధగా వుంటుంది.
    @భరత్ గారు , మన ఆచార, సంప్రదాయాలు అన్నిటి వెనుక మూల సూత్రం ఆరోగ్యమె నాకు తెలిసి .గేదె పాలు,పెరుగు రుచిగా ఉంటాయి కాని ఆవు పాలు,పెరుగు మన ఆరోగ్యానికి మంచివి అంటారు అందుకే ఆవుకు ప్రధమ తాంబూలం ఇచ్చివుంటారు.

    ReplyDelete
  8. @భరత్ గారు, వరాహం అంటే వైల్డ్ బోర్(కోరలు వుంటాయి). మీ మనసుకు పంది బాగా నచ్చితే అలానే అనుకోండి, తప్పులేదు. దశావతారాలు మానవ పరిణామ క్రమం సూచిస్తుందని ఎవరో అన్నారు. (మీన-జలచర, కూర్మ-ఉభయచర, వరాహ-భూచర,నరసింహ-మనిషిమృగ, వామన-పూర్ణ మానవ, ఇలా...)

    ReplyDelete
  9. జ్యోతి గారూ
    ఆవుకు ప్రధమ తాంబూలం ఇవ్వడం కాదండీ. అవుకు మాత్రమె తాంబూలం ఇచ్చారు.
    గేదెకు ద్వితీయ తామ్బూలమూ లేదు తృతీయ టాంబూలమూ లేదు.
    అట్లాగే గేదె పాలకంటే ఆవుపాలు వేడి, పిల్లలకు త్వరగా జీర్ణం కావు అని విన్నాను.
    ఆవు నెయ్యి కూడా జీర్ణం కాదంటారు. ఎంతవరకు నిజమో తెలియదు.
    ఏమైనా ఇవాళ మార్కెట్ లో ఎక్కువగా దొరికేది గేదె పాలే
    అలాంటి గేదెకు కనీస గౌరవం కూడా ఎవ్వరూ ఇవ్వరు.
    ఇది అన్యాయం కదా.
    .......
    వరాహం అంటే ఇంగ్లీషులో వైల్డ్ బోర్ అంటారు....
    సరే నండీ తెలుగులో ఏమనాలి. ?
    అడవి పంది అనొచ్చా. ?
    పంది అనే మాట వాడుతున్నందుకు నన్ను అసహ్యించుకుంటే ఎట్లా మాస్టారూ
    ఉన్న విషయమే కదా. అసలు మన దేవుడు
    మరో గౌరవప్రదమైన జంతువూ అవతారం ఎత్తకుండా
    ఈ వరాహం అనగా మీ భాషలో వైల్డ్ బోర్ అవతారం ఎత్తినందుకు నాకైతే చాలా ఇబ్బంది గా అనిపిస్తుంది.
    ఇతర మతస్తులతో చర్చించేటప్పుడు మరీ ఇబ్బందిగా వుంది.

    దేవుడు వరాహం అవతారమే ఎత్తడానికి,
    ఆవునే పూజించడానికి సంతృప్తికరమైన సమాధానాల కోసం ఎదురుచూస్తాను.
    - భరత్

    ReplyDelete
    Replies
    1. @ భరత్,
      ఈ వరాహ అవతారం గురించి మీరు కొంత తెలుసుకోవాలి, ఈ అవతార పరమార్థం హిరణ్యాక్షుని వధ మరియు భూమిని పాతాళం నుండి పైకి తేవడం , ఆ పాతాల లోకం చాలా అసహ్యంగా ఉంటుంది , కనుక అలాంటి ప్రదేశం లోకి వెళ్ళడానికి మహా విష్ణు ఈ వరాహ అవతారాన్ని ధరించాడు. ఇంకా విపుల సమాచారం కోసం భాగవతాన్ని చదవండి లేక భాగవత ప్రవచనాన్ని వినండి

      Delete
  10. చాలా బాగా చెప్పారు శర్మగారు.

    ReplyDelete
  11. ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    ReplyDelete
  12. @ విజయ్ శర్మ గారు,
    చాలా మంచి పోస్టు. ఆచార వ్యవహరాల వెనక వున్న సదుద్దేశ్యాలు తెలియకనే అవి మూడాచారాలు గా రూపాంతరం చెందుతాయి అనుకుంటాము. మీ ప్రయత్నం ఎంతైనా శ్లాఘనీయం.
    @ భరత్ గారు,
    సృష్టిలో వున్న ప్రతి జీవికి పురాణాలలో ఎంతో కొంత మంచి స్థానమే వుంది, పంది, పాము, ఎలుక , దున్నపోతు, ఏనుగు ఇలా... అన్నింటిని గౌరవం తోనో భక్తి తోనో కాకపోయినా కనీసం భూత దయతో అన్నా చూస్తామని కావచ్చు. అంతెందుకు, ఇప్పుడు ఫలానా రోజు మంచిది కాదు అని ముహూర్తాలు గట్రా చూసే వారికి శ్రీ కృష్ణ జన్మ తిధి అష్టమి అని తెలియదా! అమావాస్య నాడు పండగలు లేవా? కాకపోతే ఎప్పుడు చెడుకి వున్నంత ప్రచారం మంచికి వుండదు. ( అసలు ఇలా చెడు మంచి అంటు వక్ర దృష్టితో చూడడమే తప్పు బహుశా. అసలు మంచి ఏమిటీ, చెడు ఏమిటీ మనమెవరు నిర్ణయించడానికి ?)
    ఇంతా చేసి నేనేదో సనాతనిస్టుని అని అనుకునేరు. నేను పక్కా నాస్తికుడిని. అంతే!

    ReplyDelete
  13. ఆ పందిని ఎందుకు పూజించడం లేదు?
    -------------------------
    ఎందుకు పూజించడం లేదు? అవతారాల్లో ఒకటైందంటేనే పూజనీయ స్థానం ఉందని అర్థం. సృష్టిలోని ప్రతి సజీవ నిర్జీవ పదార్థంలోనూ దైవం ఉందని చెప్పుతుంది హిందూ మతం.
    నీలాంటి వాడిలో కూడా దైవం ఉందట. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అది నిజమే.


    వరాహం అనే సంస్కృత పదమే ఎందుకు వాడాలి
    ------------------------------
    శుభకార్యమనే సంస్కృత పదమే ఎందుకు వాడారు మీరు?

    మరి గేదెను ఇలాంటి శుభకార్యాలకు ఎందుకు వినియోగించ కూడదు....
    ----------------------------
    ఉపయోగించకూడదు అని ఎవరన్నారు? ఉపయోగించడం లేదు అంతే! మీరు ఉపయోగించండి. బర్రెకు దణ్ణం పెట్టుకోని దాని మూత్రాన్ని మీ ఇంట్లో చల్లుకోండి. ఎవరు ఒద్దన్నారు?


    ఇతర మతస్తులతో చర్చించేటప్పుడు మరీ ఇబ్బందిగా వుంది.
    -----------------------------------
    చేతకానపుడు మూసుకుని కూర్చోండి.

    అసలు మన దేవుడు మరో గౌరవప్రదమైన జంతువూ అవతారం ఎత్తకుండా ఈ వరాహం అనగా మీ భాషలో వైల్డ్ బోర్ అవతారం ఎత్తినందుకు నాకైతే చాలా ఇబ్బంది గా అనిపిస్తుంది.
    ----------------------
    ఒక పని చేయండి. మతం మారిపోండి. మీకు ఈ సందేహాల పీడ వదిలి పోతుంది. మాకు మీ పీడ విరగడ అవుతుంది, ఒకడు తగ్గినా తగ్గినట్టే! వేరే మతానికి వెళ్లాక, అక్కడ ఇలాంటి ప్రశ్నలు అడక్కండి, చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకుంటారు. ఇలాంటి చాటుమాటు వేషాలు వేస్తే అక్కడ ఊరుకోరు.

    ReplyDelete
  14. హ్వ్వ్వ్వా ..హ్వ్వ్వా...హ్వవ్వా

    ReplyDelete
  15. నేను కాస్త పూజలలో ఉన్నాను. నేట్ ను తరచుగా చూడడం కుదరక పోవచ్చు. ఈ టపా వ్యాఖ్యలు కాస్త వేడెక్కి నట్లున్నాయి. వ్యక్తిపరమైన నిందలు చేయకండి. దయచేసి సున్నితంగా సమాధానం చెప్పండి. లేక పోతే అలా వదిలేయండి. ప్రశ్న కోపం తెప్పించే విధంగా, ఉన్నా కాస్త ఆలోచించి చెప్పే సమాధానం గౌరవింప బడుతుందన్న సంగతి పెద్దలకు తెలియనిది కాదు. కోపం వల్ల వివేకం నశిస్తుంది. వివేకం లేని సమాధానం చప్పగా ఉంటుంది. విషయం బటకు రాదు. కనుక శాంతించండి. నామాటలలోని అర్థాన్ని గ్రహించండి. ఒక్క సారి వ్యాఖ్యలను పునరవలోకించండి. ఎవరి వ్యాఖ్యలలో గౌరవం లోపించిందో గమనించ ప్రార్థన. అన్యదాభావించ కండి. మన ఆచారాలపై మనకున్న అభిమానం హర్షదాయకం. ధన్యవాదాలు.

    ReplyDelete
  16. మర్చిపోయాను ఒక అఙ్ఞాత గారి కామెంటు వ్యక్తిగతంగా కాస్త కించపరిచినట్లుందని తొలగించాను.

    ReplyDelete
  17. ఇక బరత్ గారికి : మీకు తృప్తి కలిగే విధంగా చెప్పగలనో లేదో కానీ నాకు నేను ఆప్రశ్న వేసుకుంటే ఏం సమాధానం చెప్పుకుంటానో అదే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.

    1. విష్ణుమూర్తి దశావతారాలలో పంది అవతారం ఒకటి కదా.
    (పంది అని తెలుగులో ఎందుకు అనకూడదు- వరాహం అనే సంస్కృత పదమే ఎందుకు వాడాలి)
    ఆ పందిని ఎందుకు పూజించడం లేదు?
    ------------------------------

    ఎందుకు పూజించడం లేదు? సింహాచలంలో వరాహావతారంలో పూజిస్తున్నాం కదా!? దానియందు కూడా భగవంతుడున్నాడనే కదా భగవత్ చిహ్నంగా వరాహం అనే గౌరవ వాచకాన్నే వాడతాం. పంది అనేది అగౌరవవాచకం. దాని యందుకల నీచత్వానికి చిహ్నం. అది గౌరవవాచకం కాక పో బట్టే మీ వ్యాఖ్య కొందరికి కోపం తెప్పించ్చింది.

    పందినే కాదు, ప్రతి జీవిలోనూ ఆఖరికి, చెట్టులోనూ- ప్రాణంలేని మట్టిలోనూ భగవంతుడున్నాడు అని నమ్మే సంస్కృతి మనది. అలా నమ్మడం వల్ల సమానత్వం నెలకొంటుంది.

    ReplyDelete
  18. 2. ఆవు పాలిస్తుంది - సరే గేదెలు కూడా పాలిస్తాయి కదా
    మనం రోజూ తాగుతున్నది గేదె పాలే కదా
    మరి గేదెను ఇలాంటి శుభకార్యాలకు ఎందుకు వినియోగించ కూడదు....
    ఎవరైనా వివరంగా చెప్తారా?

    ఈ ప్రశ్నలు తలాతోకా లేకుండా ఏదో కాస్త తేనెతుట్టును కదిపి ఆనందిద్దాం అన్నట్టు కొందరికి అనిపించ వచ్చు. కానీ సమాధానం చెప్పుకోవలసిన బాధ్యత మనందరికీ ఉందని నా అభిప్రాయం. రేపు మీ పిల్లలే ఈ ప్రశ్న వేస్తే వారికేం సమాధానం చెప్తారు? ఓ పురోహితుడిగా నాకు తరచూ ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. అవి వారు నా నమ్మకాలమీద ఆసక్తిలేక వేసే ప్రశ్నల్లా నాకనిపించవు. ఆసక్తితో వేశారనే భావనే కలుగుతుంది. సరే నా సమాధానం చెప్తాను.

    బ్రహ్మ సృష్టి, విశ్వామిత్ర సృష్టి అని రెండు ఉన్నాయి. ఆవు-గేదె, కొబ్బరి చెట్టు - తాటి చెట్టు ఇలా ఏవో కొన్నిరకాలు ఉన్నాయి. natural-artificial లాగ. వాటిలో బ్రహ్మసృష్టి పూజకు అర్హమైనవి, సాత్విక స్వభావంవైపు తద్వారా మానవత్వం నుండి దైవత్వం వైపు మనల్ని నడిపించేవి అని పెద్దలు చెప్తారు. విశ్వామిత్ర సృష్టి రజోగుణాన్ని కలిగించేవి, మానవత్వం నుండి రాక్షసత్వం వైపు నడిపించేవి.

    కనుక పూజలలో బ్రహ్మ సృష్టించిన వాటికే ప్రాథాన్యత ఇచ్చారు. గేదెపాలలోకన్నా ఆవుపాలలో ఉన్న శ్రేష్ఠత ఏమిటో నాకన్నా ఎవరైనా సైన్స్ బాగా తెలిసిన వారు చెప్తే బాగుంటుంది. కాకపోతే చాలమంది చెప్పేది ఆవుపాలే ఔషధగుణాలు కలిగినవని.

    కొబ్బరి నీళ్లు రోజూ తాగినా తప్పులేదు - మరి కల్లు తాగవచ్చా!? అది పూజకు ఉపయోగిస్తారా!? వీటికి ఉన్నంత తేడా కాక పోయినా ఎంతో కొంత తేడా ఆవుకూ-గేదెకూ కూడా ఉంది.

    ReplyDelete
  19. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

    ReplyDelete
  20. >>కాకపోతే చాలమంది చెప్పేది ఆవుపాలే ఔషధగుణాలు కలిగినవని.
    నేను రాస్తానులెండి, కాకపోతే కొద్దిగా ఆలస్యం అవుతుంది..
    ఆవు పాలు జీర్ణం అవడం అన్నది కాస్త అనుమానించాలి, ఎందుకంటే మనిషి పాలల్లో ఇంకా ఎక్కువ కొవ్వు వుంటుంది.

    భరత్ గారు, సమస్త భూమండలంలో ప్రతి ప్రాణి, ప్రతిదీ గొప్పదే, ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అని లేదు..

    కాకపోతే అవుకి వున్న గ్లామర్ గేదెకి ఎక్కడిది అందుకే దానికి కాస్త ఫాలోయింగ్ తక్కువ..:-)

    ఎవరి నమ్మకాలు వారివి ఈ పూజల్లో, అంతే తప్ప ఒకటి పూజనీయం అయినది, ఇంకోటి తక్కువది అంటూ ఏది లేదు..

    ReplyDelete
  21. శర్మ గారికి ధన్యవాదములు.
    కొన్ని రోజుల క్రిందట నాకు కూడా ఒక అనుమానము కలిగినది.
    గేదె విశ్వామిత్ర సృష్ఠి కదా మరి ఆ పాలు శుభకార్యాలలో ఎలా వాడుతున్నారని.
    కానీ నా సమీప మిత్రుల వద్ద నుండి సమాధానము దొరకలేదు.
    నేడు మీ టపా చూసి తెలుసుకున్నాను.
    --
    మురళీ కృష్ణ

    ReplyDelete
  22. శర్మ గారు,, గోవు, గేదె ee rendinti vishayam lo racism follow అవుతున్నామండి..ఐతే పురాణాలలో kudaa ఆవుకి praadhaanyata ఇచ్చారు ఎందుకంటే దానియొక్క maintaning alawaatlu.. చెత్త వుంటే ఆవు నిలబడే వుంటుంది గాని కనీసం పడుకోదు.చాల శుభ్రత maintain చేస్తుంది. మనం గమనిస్తే ఆవు కృష్ణుని చెంతనే వుంటుంది bommalalo.. కృష్ణునితో paatu మనం గోవు కి కుడా బొట్టు pedataamu..rangu valla అందం గ కన్పిస్తుంది కాబట్టి మనకు మురిపెము.. బ్రహ్మ సృష్టిలో అన్ని జీవాలు వున్నాయి..మన కంటికి ఇంపుగా కన్పించేదాన్ని మనమే highest ప్లేస్ లో wunchutaamu.మన sentimentlalo ఒక స్థానం ఇస్తాము..edainaa మనకు నచ్చడం బట్టి వుంటుంది..అందాన్ని ప్రేమించడం మానవ నైజం. కదా..aachaaraaku maatantaaraa..nenu chesedi naa vaarasulaku nachhite ఫాలో అవుతారు..continuty .. nachhakapote singinaadam ani maro daarina nadava prayatnistaaru..దాన్ని వారి వారసులు.. అదే వారసత్వ సంపద..కావాల్సింది aarogyaaniki,మానవ మనుగడకు, మన samskrutiki ఏది మంచిదో అది ఫాలో కావడం.ఆవా,గేదె అని కాకుండా సకల jeevula యెడ దయ,ప్రేమ కలిగి వుండడం..kaaranarahita ప్రేమ కలిగి వుండడం..

    ReplyDelete
  23. శర్మ గారు మీ అర్టికల్ చాలా బాగున్నది. వాటి పై వచ్చిన వాఖ్యలు కూడా బాగున్నాయి
    ... విజయ్

    ReplyDelete
  24. చర్చలో పాలు పంచుకున్నవారందరికి చిన్న మనవి,వాస్తవానికి మనం అనుకుంటున్నావరాహం అంటే పంది కాదు, అసలు అర్ధం ఖడ్గ మృగం ,ఇది ౧౯౦౭ లో ప్రచురించిన వావిళ్ళ రామస్వామి శాస్త్రులు వారి ప్రచురణలు ఐన రూప ధ్యాన రత్నావళి అనే గ్రంధం లో వారు వివరంగా వ్రాసారు.దొరికితే నాకు చెప్పండి, నీను దానిని కామవరపుకోట లైబ్రరీలో చూసాను.

    ReplyDelete
  25. ఆవు తానూ స్వీకరించే ఆహార పదార్ధాల లోని విష తుల్యాలని తన కొవ్వులో నిలువ ఉంచుకుని ఔషధ గుణాలున్న ఆహారాలను పంచతము ,పేడల ద్వార విసర్జిస్తుంది.గో హత్య గో మాంస భక్షణ నిషేధమని చెప్పినది,పంచ గవ్యాలు ఔషధ విలువలను కలిగి ఉంటాయని చెప్ప డము అందుకే..గో పంచతము కాన్సెర్ నివారకం గ పనిచేస్తుందని ఈ మధ్యే నిరుపితమై నది .అమెరికా లో ఈ పంచతం కొరకు పేటెంట్ కు ప్రయత్నిస్తున్నారు.

    ReplyDelete
  26. Ee madya kaalam lo kulanthara/ mathanthara vivahaala joru perigindi.
    Oka brahmanudu kulanthara/ mathanathara vivaham chesukunna yadala athani brahmanatwam untunda?
    Dani valana athani brahmanatwaniki vachey nastam yamiti?

    ReplyDelete
  27. చాలా బాగా చెప్పారు విజయ్ శర్మగారు...

    ReplyDelete
  28. munduga rajasekharuni vijaysarma gariki namaskaramulu

    intha manchi blog nu medhalupeti andhari gananam nu panchutunaduku kurtagnatalu gomatha gurinchi baga cheparu alage mana sanathana dhrma ni marintha andhari dhaga cheyalani aasisthinanu.

    ReplyDelete
  29. శర్మ గారూ "వాజసనేయ" గారి వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తున్నాను. వరాహం అంటే ఖడ్గ మృగమే. ఈ విషయం ఈమధ్య పిఠాపురం వారు ప్రచురించిన శ్రీపాద వల్లభుల వారి చరితామృతం లో కూడా ఉంది. ఒంటి కొమ్ము తో భూగోళాన్ని పైకెత్తినట్టు పురాణాల్లో ఉందికదా. ఒంటి కొమ్ము ఉండేది ఖడ్గ మృగానికే. వరాహానికి కాదు. అనాది కాలం నుంచీ శిల్పులు, చిత్రకారులు, అందరూ వరాహం గానే భావించారు.

    ReplyDelete