Tuesday, February 8, 2011

ధర్మ యుద్ధం మెదలు పెట్టండి

  భరతమాత బిడ్డలందరూ కోపంతో రగిలి పోయే శీర్షిక. అదీ తల్లి సీతమ్మని కించ పరుస్తూ. ఇది చూసి ఊరుకుంటూ కూర్చుంటే ఆ తల్లి బిడ్డలుగా మనం తలదించుకున్నట్టే. ఇలా ఎంతకాలం. నేను పుట్టిన భూమిలో నా తల్లిపైనే నిందలా? ఏమిటీ వైపరీత్యం. నిన్న బ్రాహ్మణ్యమే లేదన్నారు. అటుమొన్న పూజలెందుకు? అని ప్రశ్నించారు. అది వారి వ్యక్తిగత అభిప్రాయమని మిన్నకున్నాము. కానీ నేడు మనందరికీ తల్లి అయిన సీతమ్మను...

ఇలా చూస్తూ కూర్చుంటే మాతల్లినీ మీతల్లినీ తిట్టినా పట్టని మనుషులమౌతాము.  ధర్మ యుద్ధం ఇకనైనా మొదలుపెట్టాలి. లేకుంటే ఈ బ్లాగులలో మరీ విపరీత ధోరణులు పెరిగిపొతున్నాయి. మన సహనం చేతకానితనం కాకూడదు. రాజు చేసే పని రాజు చేయాలి. అందరూ బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తే ఇలానే ఉంటుంది.

వెంటనే ఆబ్లాగు యజమానులు ఆశీర్షిక తొలగించి, తమ చర్యకు క్షమాపణ తెలియజేయాలి. న్యాయపరంగా మనమేమీ స్పందిచలేమా? ఇటువంటి వాటికి తగిన సమాధానం చేప్పలేమా?

15 comments:

  1. ఆ బ్లాగరుది అమాయకత్వమో, మూర్ఖత్వమో లేక చిత్త చాంచల్యమో తెలియదు గానీ తనకి మానసికం గా చికిత్స అవసరమనిపిస్తోంది.

    ReplyDelete
  2. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

    ReplyDelete
  3. Frankly, I dont think legal route would help. Its not necessary either. Sledge her back.


    ఇలా చూస్తూ కూర్చుంటే మాతల్లినీ మీతల్లినీ తిట్టినా పట్టని మనుషులమౌతాము
    ____________________________________________________

    She did this long back. Since not many people responded to her in a proper way, she is doing this now

    ReplyDelete
  4. >>>రాజు చేసే పని రాజు చేయాలి. అందరూ బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తే ఇలానే ఉంటుంది.

    ఇది కాస్త వివరిస్తారా?

    ReplyDelete
  5. ఆ బ్లాగు లో ఎడమ చేతి పై భాగము లో "Report abuse" అని
     వుంటుంది. దాని మీద క్లిక్ చేసి తరువాత పేజి లో 
    Report a Terms of Service Violation
    select "Hate or violence" -> continue -> continue -> submit

    for now we can do this. till further steps

    ReplyDelete
  6. అహింసో పరమోధర్మః అన్న సూక్తి అందరూ పాటిస్తే ఇలానే ఉంటుంది అన్న నిజం చాలామంది ఒప్పుకోలేరు. మన హిందూ ధర్మం అందరికీ అహింసా మార్గాన్ని బోధించలేదు. కేవలం బ్రాహ్మణులకు(గుణపరంగా) మాత్రమే బోధించింది. లేదా ఋషులు దానికి తగిన అర్హులు. అహింస పరమ ధర్మమే కానీ అది పాటించడానికి అందరూ అర్హులు కాదు. కనుక ఆస్థాయికి ఎదిగే దాకా అందరూ రాజ ధర్మాన్ని పాఠించాలి. రాజు రాజ్యాన్ని, ప్రజలను, ధర్మాన్ని ఎలా కాపాడుతాడో అలా అందరూ కాపడే ప్రయత్నం చేయాలి. కానీ కలి ప్రభావంతో అందరూ తప్పుని తప్పు అని ఖండించే ప్రయత్నం కూడా చేయడం లేదు. అందుకు గల కారణాలలో ఈ అహింసా మార్గం ఒకటి. మిగతా విషయాలలో లేని అహింస ఏదైనా గట్టివాదన వచ్చే సమయానికి మనకెందుకూ... ఎవరి పాపాన వాడే పోతాడు. అనే మాటలు చెబుతారు. ధైర్యంగా పోరాడే రాజులు నేడు కరువయ్యారు కనుకనే మన హిందూ జాతి అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. అటువంటి ధైర్యాన్ని బ్లాగరులందరూ ప్రదర్శించాలి. నచ్చని విషయాలను, చర్చలను నిర్మొహమాటంగా ఖండించాలి. మరీ శృతిమించితే వాటిని తొలగించేవరకూ నినదించాలి. మంచిని, ధర్మాన్ని ప్రోత్సహించాలి. చేతకాని వారిలా చేతులుకట్టుకుని ఇంకెంతకాలం కూర్చుంటారు? లేవండి ధర్మ యుద్ధం ప్రారంభించండి.

    ReplyDelete
  7. @ అఙ్ఞాత గారు : రాజులందరూ ( గుణాన్ని బట్టి ) రాజ ధర్మాన్ని పాఠించాలి. వీరత్వాన్ని ప్రదర్శించాలి. అన్న ఉద్దేశంతొ ఆమాట వాడానండీ. ఇక రాజులెవరో తెలుసుకోవాలంటే ఏదైనా అధర్మమనిపించే పని ఎవరైనా చేస్తే మీకు కోపం వస్తున్నట్లైతే మీలో రాజ గుణాలు ఉన్నట్లే నండీ. అందుకు ప్రత్యేక కొలమానాలేమీ అవసరంలేదు. అధర్మాన్ని చూస్తూ కూర్చోవడం కూడా అధర్మమే. దానిని మనమందరం ఎవరికి తోచిన రీతిలో వారు ఎదిరించాలి. లేకుంటే హిందూ జాతి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది.

    ReplyDelete
  8. ఎవడికి కోపమొచ్చినా, బాధవచ్చినా, అన్యాయం జరిగినా, జలుబొచ్చినా, దగ్గొచ్చినా దానికి కారణం గా చూపించేది మన హిందూ సంస్కృతిని. ఈ బ్లాగు రచయిత్రి అనాలోచితం గా ఏమీ ఆవిధమైన టపా రాయలేదు. ఏదో ఉపాయం ఆవిడకు ఉంది. కానీ కారణ మేమైనా హిందువైన ప్రతి ఒక్కరి హృదయం గాయ పడేలా ఉంది ఆ శీర్షిక. అందుకు మనం సహనం అనుకునే చేతకాని తనం కూడా ఒక కారణం. ఇది అందరూ ఖండించాలి.

    ReplyDelete
  9. మొండివాళ్ళను ఎవరు మాత్రం ఏం చెయ్యగలరండీ!

    ReplyDelete
  10. ఈ బ్లాగు రచయిత్రి అనాలోచితం గా ఏమీ ఆవిధమైన టపా రాయలేదు.
    ______________________________________________

    నన్ను రెచ్చ్గొట్టడానికి సీతాదేవిని అవమానించింది. కాని ఆవిడ ప్లేన్ తలక్రిందులై మిగతావాళ్ళు కూడా తిరగబడుతున్నారు. ఇదే చెప్తూ మరో పోస్టు వస్తుందేమో చూడండి.

    ReplyDelete
  11. జరిగిన విషయం కొద్దిగ ఉదహరించి ఉంటే విషయం తెలియనివాళ్ళకు అర్ధం అయిఉండేది.

    ReplyDelete
  12. ఆ బ్లాగు లో ఎడమ చేతి పై భాగము లో "Report abuse" అని
    వుంటుంది. దాని మీద క్లిక్ చేసి తరువాత పేజి లో
    Report a Terms of Service Violation
    select "Hate or violence" -> continue -> continue -> submit

    for now we can do this. till further steps

    ReplyDelete
  13. వదిలేయండి. పిచ్చిది. పిచ్చివాళ్ళ మాటలకు అంత విలువివ్వడం ఎందుకండి.

    ReplyDelete
  14. Ohhh.....only 13 comments, Its too bad. 295 A is the right solution. Think for it. writing is not enough. You should act. What about tasleema ? What did pakisthanis done ? Think about that line, its better. All the best

    ReplyDelete
  15. Please delete her lunatic comment and neck her out.

    ReplyDelete