Wednesday, March 2, 2011

శ్రీ సూక్త విధాన గౌరీ పూజ( Sree Sukta Vidhaana Gouri Pooja PDF - Telugu )


 మహా శివరాత్రి శుభాకాంక్షలు

Sree Sukta Vidhaana Gouri Pooja                                                            

8 comments:

  1. కృతజ్ఞతలండీ.

    ReplyDelete
  2. కృతజ్ఞతలండీ.

    ReplyDelete
  3. రాజ శేఖర్ గారు
    కొన్ని సందేహాలు ఉన్నాయి అండి. ప్రతి దినము లేదా ప్రతి మంగళ వారము ఈ పూజ చేసేటప్పుడు, ఆభరణము అంటే ఏది ఇవ్వగలము అండి? అలాగే నైవేద్యం మన శక్తి ప్రకారము చేయవచునా? నేను ప్రతి శుక్రవారము అమ్మవారికి ఒక భక్ష్యం (దద్దోజనం, పరమాన్నం, పాయసం) ఇలాంటివి చేస్తాను ఏదో ఒకటి. అలానే చేయవచ్చున ? అలాగే కొబ్బరి నీళ్ళు అంటే మనం కొబ్బరి కాయ కొట్టగా వచ్చే నీళ్ళు ని ఉపయోగించ వచ్చా? గౌరీ మాత ఫోటో పెట్టుకుని, పసుపు తో గౌరీ దేవి ని చేసి పూజించవచ్చ? పూజ చేసిన తరువాత పసుపు గౌరీ దేవిని ఏమి చెయ్యవలెను? గణపతి పూజ కూడా చెయ్యవలేనా ప్రతి మంగళవారం చేద్దాము అని సంకల్పించిన్నప్పుడు? దయ చేసి వివరించ ప్రార్ధన. ఇన్ని సందేహాలు అడిగినందుకు క్షమించమని ప్రార్ధన. ఇంత మంచి పూజ చెప్పినందుకు సర్వదా కృతజ్ఞతలు.
    శశిరేఖ

    ReplyDelete
  4. నమస్కారం శశి రేఖ గారు. ఆభరణం అన్నప్పుడు మీరు ఇవ్వగలిగితే రొజూ ఆభారణం ఇవ్వ వచ్చు. లేదా పూలమాలలో, అక్షతలో సమర్పించ వచ్చు. నైవేద్యము కూడా మీ శక్తిని బట్టి చేయవచ్చును. పసుపు గౌరీ దేవికి పూజ చేయవచ్చు. లేదా రాతి గౌరి కి కూడా పూజ చేయవచ్చు. ( మొన్నమొన్నటిదాకా కూడా రాతితో చేసిన గౌరి, గణపతి ప్రతీ ఇంట్లో ఉండేవి. ) పూజానంతరం ఆపసుపు గౌరిని ఎవరూ తొక్కని ప్రదేశములో( కాస్త పెద్ద చెట్టు మొదట్లో ) వేయాలి. లేదా అలా దాచిపెట్టి నదిలో కలుప వచ్చు. గణపతి పూజ చేయాలి. మీ సమయమును బట్టి. సమయం తక్కువ ఉండి, అన్నీ చేయాల్సిందే అనుకుంటే కుదరదు. ఏదో ఒక్కటైనా సవ్యముగా సాగించడం ఉత్తమం. సమయం ఉంటే తప్పక చేయండి. లేదంటే గణపతిని ప్రార్థించి గౌరీపూజ మొదలుపెట్టండి. మొదట చిన్నగా మొదలు పెట్టి, క్రమంగా మీ సమయాన్ని బట్టి పూజా సమయాన్ని పెంచుకుంటూ వెళ్లడం ఉత్తమమైన పని.

    ఏమైనా పూజలో మీ భావన ముఖ్యం. ఎన్ని ఆభరణాలతో, నైవేద్యాలతో పూజిస్తున్నారన్నదానికంటే ఎంత శ్రద్ధతో చేస్తున్నారన్నదే ముఖ్యం. మంత్రం కంటే మనసు శక్తి వంతమైనది. ఆ మనసుతో చేసే పూజ స్వల్పమైనదే అయినా అది అనంత ఫలాన్నిస్తుంది. అనేక మందికి పూజ చేయడం రాదు, కానీ రోజూ చక్కగా పూలతో అలంకరిస్తారు. వారినికోసారి విగ్రహాలను తెల్లగా తోముకుంటారు. అనేక దీపాలతో అలంకరిస్తారు. అలా కనులకింపుగా స్వామిని చూస్తేకాని కొందరికి మనసు సంతోషపడదు. ఈ రోజు ఏదైనా తక్కువైంది అనుకుంటే మరునాడు అది కష్టపడి సంపాదించి స్వామికి సమర్పిస్తారు. ఈ విధంగా ఏమీరాకుండానే ఆ భగవంతుడికి అత్యంత ఆప్తులై పోతుంటారు. ఇలాంటి వారు అనేకులను నేటికీ నేనెరుగుదును. ఎన్నో విధివిధానాలు తెలిసిన వారు కూడా పూజించ లెనంత తృప్తిగా ఆ భగవంతుని సేవిస్తున్న వీరిది ఎంతటి భాగ్యము అని మనసులోనే సంతోషిస్తుంటాను. నాకేమీ పూజా విధానం రాదండీ అనే ఆతల్లుల వినయం చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది.

    ReplyDelete
  5. plz read for information
    gsystime.blogspot.com
    galaxystime.blogspot.com
    galaxystartime.blogspot.com

    Thanks

    ReplyDelete
  6. can you please send this pdf to my email id viribonie@gmail.com

    ReplyDelete
  7. ఈ క్రింది లింకులో మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

    https://docs.google.com/file/d/0B0Zi3RYt07USSTJveG1DWE9taWc/edit

    ReplyDelete