Wednesday, May 15, 2013

చక్ర రేఖలవలన కలుగు ఫలములు - సాముద్రిక శాస్త్రం




శరీరములో అనేక చోట్ల చక్రముల వంటి గీతలు కనిపించును. ప్రథానంగా చేతి వేళ్ల చివర చక్రమువలె గుండ్రముగా తిరిగిన గీతలసముదాయము కన్పిస్తుంది. వాటివలన కలుగు ఫలితములు ఈక్రిందివిధంగా ఉంటాయి


పాద చక్రేతు యాత్రావాన్ భూశాయీ పార్శ్వ చక్రవాన్
పృష్ఠ చక్రే భారవాహీ కుక్షి చక్రే సుభోజనమ్

అరికాలి యందు చక్రమున్న దేశదిమ్మరియు, పార్శ్వమందు చక్రమున్న భూమియందు శయనించు వాడును, వీపుమీద చక్రమున్న బరువులు మోసి జీవించువాడు, కడుపు మీద చక్రమున్న మృష్టాన్న భోజనము కలవాడు అగును.

ఏక చక్ర స్సదాభోగీ ద్విదుకో రాజపూజితః
ధనాఢ్యస్తు త్రిభిచ్చక్రై శ్చతుశ్చక్రో దరిద్రకః

చేతి వేళ్ల చివరి భాగములలో ఒక చక్రముండిన ఎల్లప్పుడును సుఖము ననుభవించువాడును, రెండు చక్రములుండిన రాజపూజితుడును, మూడు చక్రములుండిన ధనాఢ్యుడును, నాలుగు చక్రములుండిన దరిద్రుడును అగును.

విలాసే పంచ చక్రేణ షట్చక్రేణతు కాముకః
సప్తచక్రేణ శుభవాన్ అష్టచక్రేణ రోగవాన్

ఐదు చక్రములుండిన స్త్రీలోలుడును, ఆరు చక్రములుండిన కాముకుడును, ఏడు చక్రములుండిన సౌఖ్యములను అనుభవించువాడును, ఎనిమిది చక్రరేఖలుండిన సదా రోగములచే బాధపడువాడును అగును.

భూపాలో నవ చక్రేణ దశచక్రేణ యోగవాన్
ఏవం చక్ర ఫలందృశ్యం సాముద్ర వచనం తథా

తొమ్మిది చక్రములుండిన భూపాలుడును, పది చక్రములుండిన యోగవంతుడును అగును. ఈవిధంగా చక్రఫలితములు తెలుసుకొనవలెను.

2 comments:

  1. అజ్ఞాతMay 22, 2013 at 3:32 PM

    asalu chakralu ya layka potha hand lo yanti situation plz post in blog..

    ReplyDelete
  2. చక్రాలు లేకపోతే శంఖాలు ఉంటాయి. వాటివలన కొన్ని ఫలితాలు ఉన్నాయి. :)

    ReplyDelete