Wednesday, August 7, 2013

మీ పేరుకు సరిపడే ఊరు ఏది? ( గ్రామార్వణము )

గ్రామార్వణము:  గృహ నిర్మాణము చేయునపుడుగ్రామార్వణముమరియుదిశార్వణములను బట్టి ఇల్లుకట్టుకొనుట శుభము. హైదరాబాదు వంటి ప్రాంతాలలో ఉండేవారుఏది తమ ఊరిపేరు అనుకోవాలిఅని సందేహపడుతుంటారు. హైదరాబాదు ఊరు కాదు అదిఒక జిల్లా. కనుక మీరు ఏగ్రామ పంచాయితీ లేదా టౌన్ షిప్ లేదామున్సిపాలిటీ పరిధిలోకి వస్తారో అదే మీ ఊరిపేరు. గృహవిషయమై జన్మనక్షత్రం కంటే నామ నక్షత్రమేబలమైనది. కనుక పేరును బట్టిచూసుకుంటే సరిపోతుంది. మీకు అనేక పేర్లు ఉన్నప్పటికీ ఎక్కువగా వాడుకలో ఉన్న పేరు మీ పై ప్రభావాన్ని కలిగి ఉంటుంది.   క్రింది పట్టిక చూస్తే మీ నామ నక్షత్రముఏమిటో తెలిసిపోతుంది.



గ్రామ నక్షత్రము నుండి, నామ నక్షత్రము వరకులెక్కించగా వచ్చిన సంఖ్యను బట్టి ఆగ్రామము మీకుసరిపోతుందా లేదా అనేది నిర్ణయించాలి.  నరుని శిరము నుండి వివిధఅంగాలకు వివిధ నక్షత్రాలను ఊహచేసెడి చక్రము కనుకనరాకార చక్రముఅనిదీనికి పేరు.
శ్లోకం  :  శిరః పంచార్ధ లాభం , ముఖేత్రీ అర్ధ నాశనం , బాణరో
ధన దాన్యంచ పాదయో షట్ దరిద్రః  ప్రుష్టేకం ప్రాణ సందేహం
చతుర్నాభి శుభావహం,నేత్రే ద్వి ప్రీతి లాభంచ ,
సవ్యహస్తేన సంపదా , వామ హస్తనే దరిద్రః

      శిరస్సు నందు 5 నక్షత్రములు ధన లాభమును , ముఖము నందు 3 నక్షత్రములు ధన నష్టమును, గర్భమునందు 5 నక్షత్రములు ధన ధాన్య సమృద్ధిని , పాదముల యందు 6 నక్షత్రములు దరిద్రమును, పృష్టం నందు 1 నక్షత్రము ప్రాణ నష్టమును, నాభి యందు 4 నక్షత్రములు శుభమునునేత్రముల యందు 2 నక్షత్రములు ప్రీతిని, కుడి చేతి యందు 1 నక్షతము సంపదను, ఎడమ చేతియందు 1 నక్షత్రము దరిద్రమును కలుగజేయును .

ఉదాహరణకు :  వారాసీ గూడ అనే ఊరిలో రామారావు ఉండాలనుకుంటున్నాడు. ‘వాఅంటే రోహిణీ నక్షత్రము, ‘అంటే చిత్త నక్షత్రము వస్తుంది. రోహిణి నుండి లెక్కిస్తే చిత్త11 నక్షత్రం అవుతుంది. మొదటి 5 ధనలాభం, తరువాత 3 ధన నష్టం,  తరువాతి 5 ధనధాన్య సమృద్ధి కనుక రామారావు వారాసీ గూడాలో నిరభ్యంతరముగా ఉండవచ్చు.

No comments:

Post a Comment