Wednesday, September 25, 2013

నవరాత్రుల లో అమ్మవారి అవతారాలు, పెట్టవలసిన నైవేద్యాలు, శ్లోకాలు

ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాశించ వలెను. 



 
నవదుర్గలు :
ప్రథమా శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|
తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|
పంచమా స్కందమాతేతి|  షష్ఠా కాత్యాయనేతిచ|
సప్తమా కాళరాత్రీచ|  అష్టమాచేతి భైరవీ|
నవమా సర్వసిద్ధిశ్చాత్|  నవదుర్గా ప్రకీర్తితా||

నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి. ఆంధ్ర దేశమున అమ్మవారి యొక్క వివిధ అలంకారములతో దేవి ని కొలవడం కూడా ఉన్నది.  క్రింద తేదీ, తిథి, ఆరోజు దుర్గా అవతారము, ప్రక్కన ఆంధ్ర దేశ సాంప్రదాయం ప్రకారం పూజింప దగిన అలంకారం, ఆరోజు విధిగా పెట్ట వలసిన నైవేద్యము, ఆరోజు దుర్గా రూపానికి కల ధ్యానశ్లోకము అందిస్తున్నాను. ఈ శ్లోకాలను ఆరోజంతా వీలైనంత ఎక్కువగా పారాయణ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాము. 

 

నవదుర్గా ధ్యాన శ్లోకములు :
05-10-2013 ఆశ్వయుజ శు.పాడ్యమి శనివారం శైలపుత్రీ : (బాలా త్రిపుర సుందరి) నైవేద్యం :  కట్టు పొంగలి
శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం|  వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

06-10-2013 ఆశ్వయుజ శు.విదియ ఆదివారం  బ్రహ్మ చారిణి ( గాయత్రి ) నైవేద్యం :  పులిహోర
శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

07-10-2013 ఆశ్వయుజ శు.తదియ సోమవారం చంద్రఘంట ( అన్నపూర్ణ ) నైవేద్యం :  కొబ్బరి అన్నము
శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

08-10-2013 ఆశ్వయుజ శు.చవితి మంగళవారం కూష్మాండ ( కామాక్షి ) నైవేద్యం : చిల్లులులేని అల్లం గారెలు
శ్లో||  సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ| దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||

09-10-2013 ఆశ్వయుజ శు.పంచమి బుధవారం స్కందమాత ( లలిత ) నైవేద్యం : పెరుగు అన్నం
శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||

10-10-2013 ఆశ్వయుజ శు.షష్టి గురువారం కాత్యాయని(లక్ష్మి)  నైవేద్యం : రవ్వ కేసరి
శ్లో|| చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||

11-10-2013 ఆశ్వయుజ శు.సప్తమి శుక్రవారం కాళరాత్రి ( సరస్వతి )  నైవేద్యం : కూరగాయలతో వండిన అన్నాన్ని
శ్లో||  ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||

12-10-2013 ఆశ్వయుజ శు.అష్టమి శనివారం మహాగౌరి( దుర్గ )  నైవేద్యం : చక్కెర పొంగలి (గుఢాన్నం)
శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||

13-10-2013 ఆశ్వయుజ శు.నవమి + దశమి ఆదివారం సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి ) నైవేద్యం : పాయసాన్నం
శ్లో|| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి | సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

దుర్గా ధ్యాన శ్లోకము :
శ్లో||  ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాం
శంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |
సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం
ధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ||

Saturday, September 21, 2013

పితృతర్పణము




అమావాస్య, గ్రహణములు, సంక్రమణములు, నదీపుష్కరములు, మహాలయములు మొదలైన సందర్భములలో ను -  నిత్యము చేయవలసిన పితృ తర్పణము క్రింది PDF  లో పొందుపరచాను.
మీ సూచనలు, సందేహాలు తెలుపగలరు.

పితృ తర్పణము పై క్లిక్ చేసి ఫైల్ పొందగలరు. 

Friday, September 20, 2013

వైశ్వదేవము



అన్నశుద్ధి కోసం, ఋణ విముక్తి కోసం గృహస్థుడైన ప్రతీ బ్రాహ్మణుడు నిత్యము “వైశ్వదేవము” చేయాలి. ఈ వైశ్వదేవము చేయుట వలన బ్రాహ్మణుడు పంచసూనములు అను ఐదు పాపములనుండి రక్షింపబడుతున్నాడు. అంటె అన్నము వండునపుడు ౧. కూరలు తరుగుట, ౨. నూఱుట, ౩. పొయ్యి యందు నిప్పురాజేయుట, ౪. నీటిని కడవలలో ఉంచుట, ౫. అలుకుట,చిమ్ముట అను క్రియలు చేయునపుడు ఎన్నియో క్రిమి కీటకముల నశించుచున్నవి. వాటివలన బ్రాహ్మణునికి పాపము కలుగుతున్నది. ఆయా పాపములను తొలగించుకొనని గానీ "జన్మ రాహిత్యమను" స్థితికి అతడు అర్హుడవడు. బ్రాహ్మణ జన్మమే ( దానిని సక్రమముగా ఉపయోగించుకొనిన ఎడల )  చివరి జన్మమని వేదము పలుకుచున్నది. అటువంటి ఉత్కృష్ట జన్మము పొంది నప్పటికీ పైన చెప్పినటువంటి పాపములను చెయక తప్పుటలేదు. వాటి పరిహారార్థము  "దేవయఙ్ఞము, పితృ యఙ్ఞము, భూతయఙ్ఞము, మనుష్యయఙ్ఞము, బ్రహ్మయఙ్ఞము" అన పంచ యఙ్ఞములను ఆచరించి బ్రాహ్మణుడు అన్నమునకు కలిగిన పాపమును తొలగించుకొనుటయే వైశ్వదేవము అనబడును.