Friday, September 20, 2013

వైశ్వదేవము



అన్నశుద్ధి కోసం, ఋణ విముక్తి కోసం గృహస్థుడైన ప్రతీ బ్రాహ్మణుడు నిత్యము “వైశ్వదేవము” చేయాలి. ఈ వైశ్వదేవము చేయుట వలన బ్రాహ్మణుడు పంచసూనములు అను ఐదు పాపములనుండి రక్షింపబడుతున్నాడు. అంటె అన్నము వండునపుడు ౧. కూరలు తరుగుట, ౨. నూఱుట, ౩. పొయ్యి యందు నిప్పురాజేయుట, ౪. నీటిని కడవలలో ఉంచుట, ౫. అలుకుట,చిమ్ముట అను క్రియలు చేయునపుడు ఎన్నియో క్రిమి కీటకముల నశించుచున్నవి. వాటివలన బ్రాహ్మణునికి పాపము కలుగుతున్నది. ఆయా పాపములను తొలగించుకొనని గానీ "జన్మ రాహిత్యమను" స్థితికి అతడు అర్హుడవడు. బ్రాహ్మణ జన్మమే ( దానిని సక్రమముగా ఉపయోగించుకొనిన ఎడల )  చివరి జన్మమని వేదము పలుకుచున్నది. అటువంటి ఉత్కృష్ట జన్మము పొంది నప్పటికీ పైన చెప్పినటువంటి పాపములను చెయక తప్పుటలేదు. వాటి పరిహారార్థము  "దేవయఙ్ఞము, పితృ యఙ్ఞము, భూతయఙ్ఞము, మనుష్యయఙ్ఞము, బ్రహ్మయఙ్ఞము" అన పంచ యఙ్ఞములను ఆచరించి బ్రాహ్మణుడు అన్నమునకు కలిగిన పాపమును తొలగించుకొనుటయే వైశ్వదేవము అనబడును.

1 comment: