భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త ఏవి చేయరాదు?
గర్భిణీ పతి ధర్మములు :
శ్లో|| గర్భిణీ వాంఛితం ధర్మం తస్యైదద్యాద్యథోచితం | సూతే చిరాయుషం పుర్తమన్యథా దోషమర్హతి||
గర్భిణీ స్త్రీ గోరిన వస్తువును ఉచితమైనదానిని తెచ్చియిచ్చుట భర్త యొక్క ముఖ్య ధర్మము. చిరాష్మంతుడగు పుత్రుడు గల్గును. లేనిచో దోషము గల్గును.
మఱియు సముద్ర స్నానము, చెట్లు నరుకుట, క్షౌరము, శవము మోయుట, విదేశ ప్రయాణము చేయరాదు. ఏడవనెల మొదలయిన నాటి నుండి క్షౌరము, మైథునము, తీర్థయాత్ర, శ్రాద్ధభోజనము, నావయెక్కుట విడువ వలెను. పర్వతా రోహణము, యుద్ధములు జేయుట, గృహమునకు స్తంభ ముహూర్తముగానీ, గృహారంభముగానీ, వాస్తుకర్మ గానీ చేయరాదు. నఖ కేశములు కత్తిరించుట, కుమారునకు చౌలకర్మ చేయుట, వివాహము, ఉపనయనము, పిండదానము, శవమును అనుసరించి వెళ్ళుట, ప్రేతకర్మలు చేయుట చేయరాదు.
క్షౌర కర్మ, ప్రేతకర్మ చేయరాదన్ననూ ప్రాప్తమున్నచో ( తలిదండ్రుల మరణాదులచే ప్రాప్తమైనచో ) చేయక తప్పదు. కొందరు తలిదండ్రుల ప్రత్యాబ్దీకములందు బిండదానము చేయుచున్నారు. పిండప్రదానము దర్శమహాలయ శ్రాద్ధాదులందు చేయనవసరం లేదు.
guruvu garu, maa talli garu 2 nelala kritam swargastulayyaru. intilo vunna pooja gadi lo nitya deepaaradhana cheyyya vachha? alage emi cheyya kudadho telupa galaru. sorry, i am not able to type it in telugu
ReplyDeleteనిత్య పూజ, దీపారాథన చేసుకోవచ్చు. అశౌచ ప్రకరణం వీలును బట్టి రాస్తాను.
ReplyDelete