Tuesday, October 13, 2015

శ్రీ దేవీ నవరాత్రులు - పూజా విధానం - అలంకారాలు - నైవేద్యాలు

శ్రీ దేవీ నవరాత్రి పూజావిధానం 

పై లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకో గలరు.


         దేవీ నవరాత్రులలో ఏ అలంకారాలు వేయాలి అనేది పెద్ద చర్చ. భారతం అంతా ఆమోదించినది, శాస్త్ర పరమైనవి “ప్రథమం శైలపుత్రీ...” అనేశ్లోకం ప్రకారం ఉన్న అలంకారాలు. విజయవాడలో చేసేవి అక్కడి సాంప్రదాయం ప్రకారం చేస్తున్నారు. క్రింద రెండు రకాలు ఇస్తున్నాను. నైవేద్యాలు ఏవైనా పెట్టవచ్చు. కానీ లోకాచారంగా వస్తున్న నైవేద్యాలు కూడా ఇస్తున్నాను. రంగులకు ఒక నియమం లేదు. నలుపు కాకుండా ఏవైనా కట్టవచ్చు.  ఆరోజు చేసే అలంకారాన్ని బట్టి రంగులు మారుతుంటాయి


13-10-2015 : శైలపుత్రీ (స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి)- నీలం రంగు - ఉప్పు పొంగలి
14-10-2015 : బ్రహ్మ చారిణి (బాలా త్రిపుర సుందరి) - పసుపు రంగు పులిహోర
15-10-2015 : చంద్రఘంట (గాయత్రి)లేత ఎరుపు రంగు - కొబ్బరి అన్నం
16-10-2015 : కూష్మాండ (అన్నపూర్ణ) - ఆకాశం రంగు - అల్లం గారెలు
17-10-2015 : స్కందమాత (లలిత పంచమి ప్రథానంగా ఉండాలి) - కనకాంబరం రంగు - పెరుగన్నం
18-10-2015 : కాత్యాయని  (మహాలక్ష్మి) - ముదురు ఎరుపు రంగు రవ్వకేసరి
19-10-2015 : కాళరాత్రి (సరస్వతి మూలా నక్షత్రం ప్రథానంగా ఉండాలి) - తెలుపు రంగు కదంబం
20-10-2015 : మహాగౌరి (దుర్గాదేవి) - ఎర్రటి ఎరుపు రంగు - మినపగారెలు
21-10-2015 : సిద్ధిధాత్రి (మహిషాసుర మర్దిని) - ఆకుపచ్చ రంగు - పరమాన్నం
22-10-2015 : విజయదుర్గ - (శ్రీ రాజరాజేశ్వరి)కాషాయం రంగు దధ్యోదనం, లడ్డూలు

 

6 comments:

  1. Thanks.. Good Info

    ReplyDelete
  2. శ్రీ దేవీ నవరాత్రులు మీరు చెప్పిన విదానం బాగుంది.

    ReplyDelete
  3. Guruvu garu namaskaram. Naku oka chinna sandeham.Daya chesi theerchagalaru.Memu oka illu konnamu. Prasthutham ma thodikodalu ki 5va nela.maadi joint family kadu.kanuka memu gruhapravesam chesukovacha.daya chesi cheppagalaru.

    ReplyDelete
  4. can i have your contact no.

    ReplyDelete
  5. గురువు గారికి నమస్కారం
    నాకు చిన్న సందేహం,దయచేసి తెలపగలరు
    దేవి నవరాత్రి ఉత్సవాలలో -బాలత్రిపుర సుందరిదేవి,గాయత్రి,సరస్వతి,అన్నపూర్ణ,మహాలక్షి,దుర్గాదేవి అవతారములలో చేయాల లేక
    శైలపుత్రి,బ్రహ్మచారిని అవతారాలలో చెయాల?
    శైలపుత్రి అవతారాలలో చేద్దామని ఒక పంతులు గారిని అడిగితే చేయకూడదు అన్నారు దయచేసి నాఈ సందేహం తీరుస్తారని అశిస్తున్నాను
    నా ఫోన్ నంబర్ 9666052777,8099999445

    ReplyDelete
    Replies
    1. ఇంట్లో చేసే పూజ సాత్విక అవతారాలకే చేయడం మంచిది. శైలపుత్రి మొదలైన వన్నీ ఉగ్ర స్వరూప ఆరాధన. వాటికి తగినంత నియమనిష్ఠలు గృహస్థు పాటించలేడు. కనుక బాలా త్రిపురసుందరి మొదలైన అవతారాలకే పూజించడం మన ఆంధ్ర దేశంలో సాంప్రదాయంగా వస్తున్నది

      Delete