Saturday, February 20, 2016

జాతకపరిశీలన ద్వారా మీ విద్య ఎలా ఉంటుందో తెలుసుకోండి KNOW YOUR EDUCATION THROUGH ASTROLOGY






       జాతక చక్రంలో 2,4,5,9 స్థానాలు పరిశీలించడం ద్వారా ఆవ్యక్తి విద్య ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు.  ద్వితీయ భావం ద్వారా బాల్యంలోని విద్య ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. నాల్గవ స్థానం ద్వారా  ఆవ్యక్తి భావ సామర్థ్యాన్ని - ఐదవ స్థానం ద్వారా హైస్కూల్, ఇంటర్, డిగ్రీ విద్య ఎలా ఉంది అనేది - తొమ్మిదవ భావం ద్వారా డిగ్రీ తరువాతి విద్య (PG, PHD etc.) గురించి తెలుసుకోవచ్చు. 

 ఇక బుధ, గురు గ్రహాలు విద్యకు కారకత్వం వహిస్తాయి. బుధుడు విద్యలో సామర్థ్యాన్ని, ఙ్ఞాపకశక్తిని తెలియజేస్తే, గురుడు అవకాశాన్ని అదృష్టాన్ని కలుగజేస్తాడు. ఈ రెండు గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి ఆవ్యక్తి యొక్క విద్య ఎలా ఉంటుంది అనేది కూడా గ్రహించ వచ్చు. మనసుయొక్క శక్తిని సూచించే చంద్రుడు కూడా మంచి స్థానాలలో ఉన్నాడా లేదా అన్నది కూడా గ్రహించాలి.  

పంచమం, దానిమీద ఉన్న గ్రహాల ప్రభావాన్ని బట్టి వారి విద్య ఏరంగంలో ఉంటుంది అన్నదాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. 

ఇంజనీరింగ్ : కుజ –శని ( రాహు సంబంధం చేత ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ ) , మేష, వృశ్చిక, మకరం, మీనం
వైద్య సంబంధ విద్య : రవి - చంద్ర – కుజ - బుధ , కర్కాటకం, కన్య, 6th , 10th స్థానాలు వైద్యవిద్యకు సంబంధించినవి
మేనేజ్ మెంట్ విద్య : గురు (ధనం) – బుధ (లెక్కలలో సామర్థ్యం), మిథున, కన్య, తుల
ఆర్ట్స్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ : శుక్ర, బుధ, రాహు, చంద్ర వృషభం, మిథున, కర్కాటకం, కన్య, మీనం  

 బాల్య విద్య: ముందుగా చర్చించుకోవలసినది విద్యలేకపోవడం గురించి. నిజానికి విద్య లేకపోవడం అనేది ఉండదు. ప్రతి వ్యక్తీ ఏదోవిధంగా విద్యను పొందుతూనే ఉంటాడు. ఒక క్రమ పద్ధతిలో పాఠశాలకు వెళ్లి చదువుకుని విద్యపొందలేక పోవడాన్ని మనం జాతకచక్ర పరిశీలన ద్వారా గుర్తించ వచ్చు. రాహు, కుజ, శని ఈ మూడ గ్రహాలు లేదా రెండు గ్రహాలు కనుక ద్వితీయ భావంలో పడితే ఆవ్యక్తికి అందరిలా స్కూలుకు వెళ్లి చదువుకునే విద్య ఉండదు. వీరి పూర్తిగా విద్య ఉండదా అంటే ఉంటుంది. కానీ చదువు పూర్తి చెయ్యడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. వీరికి ఒక పద్దతి ప్రకారం రోజూ స్కూలుకు వెళ్లి చదవడం ఇష్టం ఉండదు. మొండిగా ఉండడం, అబద్ధాలు ఆడడం మొదలైనవి ఉంటాయి.

కళాశాల స్థాయి విద్య : 10th, Inter, Degree విద్యలను సూచించేది ఐదవ స్థానం. కుజుడు ద్వితీయంలో ఉంటే తననాల్గ వ దృష్టి ద్వారా పంచమ భావాన్ని చూస్తూ ఆవ్యక్తి స్కూలు విద్యనేకాక కళాశాల విద్యను కూడా క్రమంతప్పేటట్టు చేస్తాడు. శని తృతీయ, అష్టమ, ఏకాదశాలలో ఉంటే పంచమాన్ని చూస్తాడు కనుక విద్యలో ఆలస్యాన్ని సూచిస్తాడు. అంటే వారు టీనేజ్ లో చదవవలసిన కళాశాల విద్యను ముప్పైలు, నలభైలలో చెయ్యవచ్చు. రాహువు కంప్యూటర్ విద్యను సూచిస్తాడు. రాహువు ప్రభావం పంచమంపై ఉంటె కనుక కంప్యూటర్ విద్యను అభ్యసిస్తారు.

ఉన్నత విద్య : P.G. – P.H.D. స్థాయి విద్యలను సూచించేది తొమ్మిదవ భావం. నవమ భావాధిపతి శుభస్థానాలలో ఉన్నా, నవమభావం పై శుభులైన బుధ, గురుల ప్రభావం ఉన్నా ఉన్నత విద్యను ఏఆటంకాలు లేకుండా పూర్తిచేయగలుగుతారు. అలాకాక నవమాధిపతి తృతీయ, అష్టమ, వ్యయాల పడితే  స్వస్థానంలో ఆవిద్య పూర్తిచేయడం కష్టమే. కానీ దూరప్రాంతాలలో లేదా విదేశాలలో చదివే యోగం ఉండవచ్చు.

పాప గ్రహాలు ఈ విద్యాస్థానాలలో ఉన్నప్పటికీ శుభుడైన గురువు కనుక లగ్నంలో ఉంటే ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా విద్యను పూర్తిచేసే శక్తిని ఇస్తాడు. గురుడు 5,9 తొమ్మిది స్థానాలలో ఉన్నా కూడా విద్యపై మంచి పట్టుని ఇస్తాడు. గురుడు కోణదృష్టి కలిగిన వాడుకనుక 1,5,9 స్థానాలలో ఎక్కడ ఉన్నాకూడా మిగతా రెండిటినీ కూడా తన విశేష దృష్టితో వీక్షిస్తాడు.

విద్యను గురించి చతుర్వింశాంశ (D-24 ) చక్రాన్ని పరిశీలించాలి. కానీ ఈ చక్రం ప్రతీ 5 నిమిషాలకు మారిపోతుంది కనుక ఖచ్చితమైన జన్మసమయం తెలియకపోతే ఈచార్ట్ చూడవద్దు.
విద్య అనేది అనేకవిధాలుగా ఉంటుంది. మూసపద్ధతిలో చదివిన విద్య కంటే కష్టనష్టాలు దాటుకుంటూ చదువు పూర్తిచేసిన వారు ఎందరో మనకు స్ఫూర్తిప్రదాతలుగా ఉన్నారు. ఐనస్టీన్, రమణమహర్షి, రామక్రిష్ణపరమహంస, స్వామి వివేకానంద వీళ్లందరూ ఏమిచదివారు? ఎలా చదివారు? కనుక చదవాలి, నేర్చుకోవాలి అనే ఆసక్తి తాపత్రయం ఉంటే జ్యోతిష్యశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని, ఏవైనా లోపాలు ఉంటే తగిన పరిష్కారాలు చేయడం ద్వారా మీయొక్క, మీ పిల్లలయొక్క విద్యను సరిచేసుకోవచ్చు. మొద్దులను కూడా విజేతలుగా తయారుచేయవచ్చు.  

భగవదనుగ్రహం ఉంటే సాధించలేనిది లేదు.

5 comments:

  1. మీ ఫోన్ నెంబర్ ఇస్తే మా అబ్బాయి జాతకం చూపించుకుంటాను మహాశయా!

    ReplyDelete
  2. sir,
    please provide me ur mail id &phone no.
    shekher.yama@gmail.com

    ReplyDelete
  3. బ్లాగులో పైన కుడిచేతి వేపు సంప్రదించ వలసిన నెంబర్ ఇవ్వబడింది చూడండి

    ReplyDelete
  4. Date of birth 07.11.1953. Time 12.25pm. Birth place CHIRALA (prakasm dist. A.P. Please tell me about my education for my future life

    ReplyDelete
  5. వేద విద్యా విషయం కూడా ప్రస్తావిస్తే బావుండేది ఆర్. ఎస్. గారు.

    ReplyDelete