Tuesday, February 26, 2019

అతిరుద్రము మహాపాతక నాశనము





౧) ఆవర్తనం : ప్రతిదినము నమక,చమకములతో అభిషేకార్చనలు సలుపుటను “ఆవర్తనం” అని చెప్పుదురు.
ఫలము : గంగాస్నాన ఫలము లభించడమే కాక ఏరోజు చేసిన పాపములు ఆరోజు నశించును.

౨) రౌద్రీ : నమకము ఒకసారి చెప్పి, చమకములో ఒక అనువాకము చెప్పి, మరలనమకము తదనంతరం చమకములోని రెండవ అనువాకం ఇలా 11 సార్లు నమకముతో 1 చమకము పూర్తి చేయుటను “రౌద్రీ” ( ఏకాదశ రుద్రము ) అంటారు.   
ఫలము : జన్మజన్మాంతర పాపఫలము ఆరునెలలో నశించును.

౩) లఘురుద్రం : రౌద్రీని 11 సార్లు ( అనగా 11*11 = 121 నమకములతో 11 చమకములతో అభిషేకము కానీ జపము కానీ ) జరిపితే దానిని “లఘురుద్రము”  ( రుద్రైకాదశినీ ) అందురు.
ఫలము : సూర్యలోక ప్రాప్తి, తేజస్సు, విజయము

౪) మహారుద్రము : లఘురుద్రమును 11 సార్లు జరిపినచో అది “ మహారుద్రము” అనబడును. 121*11= 1,331 నమకములతో, 121 చమకములు ఇందు ఆవృతమగును.
ఫలము : దరిద్రుడు ధనవంతుడగును. మహాపాపములు పరిహారమగును.

౫) అతిరుద్రము : 14,641 సార్లు నమకము, 1,331 చమకములు ఆవృతము చేసినచో అనగా 11 మహారుద్రములు (1,331 *11 = 14,641 ) చేయుటను అతిరుద్రము అందురు.
ఫలము : నిష్కృతి లేని మహాపాప, అతిపాతక, ఉపపాతకములు నశించవలెనంటే ఇదియే శరణ్యము.

Thursday, July 12, 2018

జ్యోతిషం నిజమవలేదా!?


జాతకం చెప్పడం లేదా చెప్పించుకోవడం చాలా మంది చేస్తూనే ఉంటారు. కానీ కొంతమంది ఎంత మంది జ్యోతిష్యులకు చూపినా నాకు సరిఅయిన ఫలితాలు చెప్పడం లేదని వాపోతుంటారు.

చెప్పినది లేదా చెప్పించుకున్నది నిజమవడం అనేది పృచ్ఛకుడు దైవఙ్ఞుడు ఒకానొక ట్యూన్ లో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. బంగారం కరగాలంటే కూర ఉడికే వేడి ఉంటే సరిపోదు. బంగారాన్ని కరిగించడానికి 1,943 degrees టెంపరేచర్ కావాలట. అలాగే మన కర్మ కరగాలంటే లోపలి ఆర్తి, భగవంతునిపై నమ్మకం ఒకానొక ఉచ్ఛ స్థాయిలో ఉండాలి. 

ప్రతి పృచ్ఛకుడు గుర్తుంచుకోవలసినది
ఆర్తి తో జ్యోతిష్యుని ఆశ్రయించిన వారికి సరైన సమాధానం దొరుకుతుంది.  కాలక్షేపం కోసం నాజాతకం ఎలా ఉందో చూడండి అని అడిగేవారికి చాలాసార్లు ఆశాభంగం కావచ్చు. 

ప్రతి దైవఙ్ఞుడు గుర్తుంచుకోవలసినది
ఒకానొక దైవఙ్ఞుడు చెప్పినవి తరచూ ఎక్కువగా సత్యమవుతున్నాయంటే - అతని శాస్త్ర కృషికి దైవానుగ్రహం తోడుగా ఉండడం వల్లె అది సాధ్యపడుతున్నది! కేవలం శాస్త్రం పాండిత్యం తో అది సాధ్యంకాదు.    ఇది నేను గట్టిగానమ్ముతున్నది.

Wednesday, July 11, 2018

How to Know will I get A Government Job or not…?



So Many People trying to get A Government Job , All are have Same question in their mind. 

In this situation Astrology will help you. Through Astrology You can save your valuable time and money. 

Here are some simple combinations for government job

Karaka For Government
Graha = Sun
Rasi = Dhanu (Jupiter strength also we should see)
Bhava = 9th house

Karaka For Job
Graha = Saturn ( Karma Karaka)
Rasi = Makara
Bhava = 10th

When 10th Bhava or Bhava Lord and Sun are strong in horoscope

10th Bhava or Bhava Lord  conected to
 10th / 6th, 11th  and 9th  
Sun / Saturn / Jupiter
Dhanu / Makara Rasi in any manner -- then there is A strong possibility to get Government Job

Same way we have to see some other Houses to gain complete knowledge on chart.
2nd  house for Money
6th  house for Service
7th  house for Boss, Relationship, self employment, Business
10th  for Good Position
11th  for Fulfilment of desires

నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందగలనా లేదా? ఎలా తెలుసుకోవాలి?



ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు
, అలా ప్రయత్నించే ప్రతిఒక్కరి మనసులో దే ప్రశ్న, నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అదృష్టం ఉందా? లేదా? అని.
జీవితంలో ఏదైనా సాధించాలంటే ౧. దృఢ సంకల్పం, ౨. గట్టి ప్రయత్నం, ౩. అదృష్టం ఉండాలి.
ఎంతో ఉన్నతమైన లక్ష్యాలు కలిగి, దానికోసం నిరంతరం శ్రమించే వారు అనేకమంది ఉన్నారు. కానీ వారందరికీ అనుకున్న పనులు అనుకోగానే అవ్వడం లేదు. దానికి కారణం తగిన అదృష్టం లేకపోవడమే! ఎంత గొప్ప కార్య సాధకులైనా వారికి అదృష్టం కూడా తోడైతేనే వారివారి లక్ష్యాలు సాధించగలుగుతారు.
కనుక మీకూ అటువంటి అదృష్టం ఉందా లేదా తెలుసుకోవడానికి జ్యోతిషశాస్త్రం మనకు సహాయపడుతుంది.
ఎంతప్రయత్నించినా ఉద్యోగం రాక, చుట్టూ ప్రతికూల పరిస్థితులలో ఉన్నప్పుడు జ్యోతిష్యం మీకు సహాయం చేస్తుంది. చాలామంది చేస్తున్న ఉద్యోగాలు మానేసి, ప్రభుత్వ ఉద్యోగాలకోసం సంవత్సరాల తరబడి లాంగ్ టర్మ్ కోచింగ్ లు తీసుకుంటూ ప్రయత్నించే వారూ ఉంటారు. ఆవిధంగా సంవత్సరాల తరబడి కాలం వెచ్చించాలనుకునే వారు ముందుగా తమ జాతకం చూసుకోవడం ద్వారా మీరు మీ విలువైన సమయాన్ని మరియు డబ్బును ఆదా చేయవచ్చు.

ఇక్కడ కొన్ని సాధారణ కాంబినేషన్లు ఉన్నాయి
ప్రభుత్వ కాకులు (ప్రభుత్వాన్ని సూచించేవారు)
గ్రహాలు =
రవి
రాశి =
9వ రాశి అయిన ధనుస్సు (అందుకే ప్రభుత్వ విషయాలలో గురు బలం కూడా చూడాలి)
భావాలు =
9 వ భావం

ఉద్యోగ కారకులు
గ్ర
హాలు = శనైశ్చరుడు (కర్మ కారకుడు)
రాశులు = 10వ రాశి అయిన
మకరరాశి
భావాలు =
10 వ భావం

ఓక వ్యక్తి జాతకంలో  రవి మరియు 9-10-11 భావము లేదా భావాధిపతులు బలంగా ఉండి
10 వ భావమునకు లేదా భావాధిపతికి
10 వ / 6 వ
, 11 వ మరియు 9 వ భావాలతోను,
రవి / శని / బృహస్పతి గ్రహాలతోను,
ధను / మకర
రాశులతోను ఏవిధముగా నైనా సంబంధం ఏర్పడినట్లైతే ఆవ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి బలమైన అవకాశం ఉంది అని చెప్పవచ్చు.

కేవలం 10వ భావాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోరాదు. ఆ వ్యక్తి జాతకంలోని మిగతా భావాలను, భావాధిపతులను సునిసితంగా పరిశీలించాలి. ఆజాతకునికి అర్హత సమగ్రంగా తెలుసుకోవడం కోసం ఇలాగే మనం మరికొన్ని భావాలను పరిశీలించాలి....
ధన విషయాల కోసం రెండో ఇంటిని
సర్వీస్ కోసం 6 వ
భావాన్ని
బాస్
, రిలేషన్షిప్, స్వీయ ఉపాధి, వ్యాపారం కోసం 7 వ ఇంటిని
పదవి కోసం 10 వ భావాన్ని
కోరికలు నెరవేర్చడానికి 11 వ
భావాన్ని ఆ భావాధిపతిని పరిశీలించాలి.
ఈ విధంగా పై భావాలన్నిటినీ పరిశీలించిన మీదట ఒక నిర్ణయానికి రావలసి ఉంటుంది.
ప్రస్తుతం త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కనుక, చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ పడ్డాయి. అందరూ ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి తమతమ అదృష్టాన్ని తెలుసుకోడానికి రంగంలోకి దిగుతున్నారు. ఈ సందర్భంలో నేను అందించే ఈవ్యాసం మీకు సహకరిస్తుందని భావిస్తున్నాను. ఒక్క విషయం గుర్తుంచుకోండి. అన్ని బలాలకన్నా సంకల్ప బలం గొప్పది. అటువంటి దృఢ సంకల్పం మీకుంటే, కాస్త తెలివిగా ఆలోచించి, దైవబలాన్ని కూడా తోడుతీసుకుని ముందుకు వెళ్లండి. అప్పుడు తప్పక జాబ్ పొంద గలుగుతారు. All the Best!!
మరిన్ని విశేషాలతో మళ్లీ కలుద్దాం!! జై శ్రీరామ్!!
R Vijay Sarma