జాతకం చెప్పడం లేదా చెప్పించుకోవడం
చాలా మంది చేస్తూనే ఉంటారు. కానీ కొంతమంది ఎంత మంది జ్యోతిష్యులకు చూపినా నాకు సరిఅయిన
ఫలితాలు చెప్పడం లేదని వాపోతుంటారు.
– చెప్పినది లేదా చెప్పించుకున్నది నిజమవడం అనేది పృచ్ఛకుడు దైవఙ్ఞుడు
ఒకానొక ట్యూన్ లో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. బంగారం కరగాలంటే కూర ఉడికే వేడి
ఉంటే సరిపోదు. బంగారాన్ని కరిగించడానికి 1,943
degrees టెంపరేచర్
కావాలట. అలాగే మన కర్మ కరగాలంటే లోపలి ఆర్తి, భగవంతునిపై నమ్మకం ఒకానొక ఉచ్ఛ స్థాయిలో
ఉండాలి.
ప్రతి పృచ్ఛకుడు గుర్తుంచుకోవలసినది
ఆర్తి
తో జ్యోతిష్యుని ఆశ్రయించిన వారికి సరైన సమాధానం దొరుకుతుంది. కాలక్షేపం కోసం నాజాతకం ఎలా ఉందో చూడండి అని అడిగేవారికి
చాలాసార్లు ఆశాభంగం కావచ్చు.
ప్రతి దైవఙ్ఞుడు గుర్తుంచుకోవలసినది
ఒకానొక దైవఙ్ఞుడు చెప్పినవి తరచూ ఎక్కువగా
సత్యమవుతున్నాయంటే - అతని శాస్త్ర కృషికి దైవానుగ్రహం తోడుగా ఉండడం వల్లె అది సాధ్యపడుతున్నది!
కేవలం శాస్త్రం పాండిత్యం తో అది సాధ్యంకాదు. – ఇది నేను గట్టిగానమ్ముతున్నది.
No comments:
Post a Comment