౧) ఆవర్తనం : ప్రతిదినము నమక,చమకములతో అభిషేకార్చనలు సలుపుటను “ఆవర్తనం” అని చెప్పుదురు.
ఫలము : గంగాస్నాన ఫలము లభించడమే కాక ఏరోజు చేసిన పాపములు ఆరోజు నశించును.
౨) రౌద్రీ : నమకము ఒకసారి చెప్పి, చమకములో ఒక అనువాకము చెప్పి, మరలనమకము తదనంతరం చమకములోని రెండవ అనువాకం ఇలా 11 సార్లు నమకముతో 1 చమకము పూర్తి చేయుటను “రౌద్రీ” ( ఏకాదశ రుద్రము ) అంటారు.
ఫలము : జన్మజన్మాంతర పాపఫలము ఆరునెలలో నశించును.
౩) లఘురుద్రం : రౌద్రీని 11 సార్లు ( అనగా 11*11 = 121 నమకములతో 11 చమకములతో అభిషేకము కానీ జపము కానీ ) జరిపితే దానిని “లఘురుద్రము” ( రుద్రైకాదశినీ ) అందురు.
ఫలము : సూర్యలోక ప్రాప్తి, తేజస్సు, విజయము
౪) మహారుద్రము : లఘురుద్రమును 11 సార్లు జరిపినచో అది “ మహారుద్రము” అనబడును. 121*11= 1,331 నమకములతో, 121 చమకములు ఇందు ఆవృతమగును.
ఫలము : దరిద్రుడు ధనవంతుడగును. మహాపాపములు పరిహారమగును.
౫) అతిరుద్రము : 14,641 సార్లు నమకము, 1,331 చమకములు ఆవృతము చేసినచో అనగా 11 మహారుద్రములు (1,331 *11 = 14,641 ) చేయుటను అతిరుద్రము అందురు.
ఫలము : నిష్కృతి లేని మహాపాప, అతిపాతక, ఉపపాతకములు నశించవలెనంటే ఇదియే శరణ్యము.
No comments:
Post a Comment