శ్రీ దేవీ నవరాత్రి పూజావిధానం
పై లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకో గలరు.
దేవీ నవరాత్రులలో ఏ అలంకారాలు వేయాలి అనేది పెద్ద చర్చ. భారతం అంతా ఆమోదించినది, శాస్త్ర పరమైనవి “ప్రథమం శైలపుత్రీ...” అనేశ్లోకం ప్రకారం ఉన్న అలంకారాలు. విజయవాడలో చేసేవి అక్కడి సాంప్రదాయం ప్రకారం చేస్తున్నారు. క్రింద రెండు రకాలు ఇస్తున్నాను. నైవేద్యాలు ఏవైనా పెట్టవచ్చు. కానీ లోకాచారంగా వస్తున్న నైవేద్యాలు కూడా ఇస్తున్నాను. రంగులకు ఒక నియమం లేదు. నలుపు కాకుండా ఏవైనా కట్టవచ్చు. ఆరోజు చేసే అలంకారాన్ని బట్టి రంగులు మారుతుంటాయి.
13-10-2015 : శైలపుత్రీ (స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి)- నీలం రంగు - ఉప్పు పొంగలి
14-10-2015 : బ్రహ్మ చారిణి (బాలా త్రిపుర సుందరి) - పసుపు రంగు – పులిహోర
15-10-2015 : చంద్రఘంట (గాయత్రి) – లేత ఎరుపు రంగు - కొబ్బరి అన్నం
16-10-2015 : కూష్మాండ (అన్నపూర్ణ) - ఆకాశం రంగు - అల్లం గారెలు
17-10-2015 : స్కందమాత (లలిత – పంచమి ప్రథానంగా ఉండాలి) - కనకాంబరం రంగు - పెరుగన్నం
18-10-2015 : కాత్యాయని (మహాలక్ష్మి) - ముదురు ఎరుపు రంగు – రవ్వకేసరి
19-10-2015 : కాళరాత్రి (సరస్వతి – మూలా నక్షత్రం ప్రథానంగా ఉండాలి) - తెలుపు రంగు – కదంబం
20-10-2015 : మహాగౌరి (దుర్గాదేవి) - ఎర్రటి ఎరుపు రంగు - మినపగారెలు
21-10-2015 : సిద్ధిధాత్రి (మహిషాసుర మర్దిని) - ఆకుపచ్చ రంగు - పరమాన్నం
22-10-2015 : విజయదుర్గ - (శ్రీ రాజరాజేశ్వరి) – కాషాయం రంగు – దధ్యోదనం, లడ్డూలు