Tuesday, July 10, 2018

లతా మంగేష్కర్ జాతక చక్ర వివరణ (Lata Mangeshkar Horoscope Analasys)



 
Birth Chart

Lata Mangeshkar : 28-09-1929, 21.50 pm, Indore 


వీరు దాదాపు 1,000  కిపైగా సినిమాలలో 50,000 కు పైగా పాటలు పాడారట. విలక్షణమైన గాత్రం వీరిప్రత్యేకత. ఎన్నో అవార్డులు వీరిని వరించాయి. దానికి తగిన గ్రహస్థితులు ఈవిధంగా ఉన్నాయి. 
 
వృషభ లగ్నం : శుక్రరాశి అయిన వృషభ లగ్నం వారికి సంగీతంలో చక్కటి అభిరుచి ఉంటుంది.
శుక్రుడు : లగ్నాధిపతియైన శుక్రుడు  చతుర్థమైన సింహం లో ఉన్నాడు : సంగీత విద్యలో ప్రావీణ్యతను తెలుపుతుంది. సింహరాశి సృజనాత్మకతను సూచిస్తుంది. శుక్రుడు దశమాన్ని వీక్షిస్తున్నాడు. వారికి శుక్రునివలన కళా సంబంధమైన వృత్తి ఏర్పడుతున్నదని స్పష్టంగా తెలుస్తుంది.
చంద్రుడు : తృతీయాధిపతి తృతీయంలో తన స్వగృహంలో ఉండడం వీరికి కల మరోబలమైన యోగం.  దీనివలన వీరికి విలక్షణమైన స్వరం కలిగిందని చెప్పవచ్చు. మీడియా కమ్యునికేషన్ రంగం అంతా తృతీయమే. చంద్రుడు బుధ నక్షత్రంలో ఉన్నాడు.  తృతీయాధి పతికి ద్వీతీయ,పంచమ  భావ సంబంధం కలిగింది. ఇదికూడా చక్కటి సంగీతయోగం.
బుధుడు:  బుధుడు ద్వితీయ, పంచమాధిపతి యై పంచమంలో ఉన్నాడు.  వీరికి గల సహజమైన సంగీత సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. పంచమంవలన సినీరంగంలో సంగీతం ద్వారా ప్రముఖస్థానం పొందడం తెలుస్తోంది.
శనైశ్చరుడు: నవమ,దశమాధిపతి శనైశ్చరుడు సప్తమంలో (భావచక్రరీత్యా సప్తమంలోకే వస్తాడు) కేతు నక్షత్రంలో ఉన్నాడు. ఆకేతువు శుక్ర రాశిలో ఉండటం గమనించవచ్చు. వృషభలగ్న జాతకులకు శనైశ్చరుడు యోగకారకుడు. అతడు వీరికి వృత్తియందు కల క్రమశిక్షణను, లోతైన పరిశ్రమను సూచిస్తున్నాడు.
గురుడు : లగ్నంలో ఉండటం ద్వారా వీరికి సృజనాత్మకతను, చక్కటి గురువులు లభించుటను, జీవితంలో కోరుకున్నవి సాధించుకొనుటను తెలుపుచున్నాడు. 

మొత్తమ్మీద చూస్తే ...

లగ్నాధిపతి శుక్రుడు అవడం, శుక్రునికి దశమంతో సంబంధం కలగడం,
ద్వితీయ పంచమాధిపతి బుధుడు అవ్వడం
తృతీయాధిపతి బలం కలిగి ఉండడం, తృతీయ భావాధిపతికి ద్వితీయ భావంతో సంబంధం,
శనైశ్చరుని వలన స్థిరంగా లోతైన పరిశ్రమ చేసే ఓర్పుకలగడం
ఇవన్నీ వీరిని సంగీత రంగంలో ఉన్నతశిఖరాలపై నిలబెట్టాయి.

వీరి జన్మ సమయంలో భిన్న వాదనలు ఉన్నాయి, బాగా పరిశీలించిన మీదట వృషభ, మిథున లగ్నాలలో వృషభమే సరైనదని తెలుస్తోంది. 

Prasna Chakra


 వీరిది బుధలగ్నమా, శుక్ర లగ్నమా అని ప్రశ్న చక్రం వేశాను. దానిద్వారా కూడా వీరిది శుక్రలగ్నమైన వృషభమనేది రుజువగుచున్నది. చంద్రుడు వృషభంలో ఉన్నాడు, జాతక చక్రంలో వలెనే శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు. రూలింగ్ ప్లానెట్స్ లో శుక్రుడు ఉన్నాడు కానీ, బుధుడు లేడు. కనుక వీరిది ఖచ్చితంగ వృషభలగ్నమే!

మరిన్ని విశేషాలు త్వరలో తెలుసుకుందాము
మీ రాజశేఖరుని విజయ్ శర్మ

No comments:

Post a Comment