Wednesday, July 11, 2018

నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందగలనా లేదా? ఎలా తెలుసుకోవాలి?



ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు
, అలా ప్రయత్నించే ప్రతిఒక్కరి మనసులో దే ప్రశ్న, నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అదృష్టం ఉందా? లేదా? అని.
జీవితంలో ఏదైనా సాధించాలంటే ౧. దృఢ సంకల్పం, ౨. గట్టి ప్రయత్నం, ౩. అదృష్టం ఉండాలి.
ఎంతో ఉన్నతమైన లక్ష్యాలు కలిగి, దానికోసం నిరంతరం శ్రమించే వారు అనేకమంది ఉన్నారు. కానీ వారందరికీ అనుకున్న పనులు అనుకోగానే అవ్వడం లేదు. దానికి కారణం తగిన అదృష్టం లేకపోవడమే! ఎంత గొప్ప కార్య సాధకులైనా వారికి అదృష్టం కూడా తోడైతేనే వారివారి లక్ష్యాలు సాధించగలుగుతారు.
కనుక మీకూ అటువంటి అదృష్టం ఉందా లేదా తెలుసుకోవడానికి జ్యోతిషశాస్త్రం మనకు సహాయపడుతుంది.
ఎంతప్రయత్నించినా ఉద్యోగం రాక, చుట్టూ ప్రతికూల పరిస్థితులలో ఉన్నప్పుడు జ్యోతిష్యం మీకు సహాయం చేస్తుంది. చాలామంది చేస్తున్న ఉద్యోగాలు మానేసి, ప్రభుత్వ ఉద్యోగాలకోసం సంవత్సరాల తరబడి లాంగ్ టర్మ్ కోచింగ్ లు తీసుకుంటూ ప్రయత్నించే వారూ ఉంటారు. ఆవిధంగా సంవత్సరాల తరబడి కాలం వెచ్చించాలనుకునే వారు ముందుగా తమ జాతకం చూసుకోవడం ద్వారా మీరు మీ విలువైన సమయాన్ని మరియు డబ్బును ఆదా చేయవచ్చు.

ఇక్కడ కొన్ని సాధారణ కాంబినేషన్లు ఉన్నాయి
ప్రభుత్వ కాకులు (ప్రభుత్వాన్ని సూచించేవారు)
గ్రహాలు =
రవి
రాశి =
9వ రాశి అయిన ధనుస్సు (అందుకే ప్రభుత్వ విషయాలలో గురు బలం కూడా చూడాలి)
భావాలు =
9 వ భావం

ఉద్యోగ కారకులు
గ్ర
హాలు = శనైశ్చరుడు (కర్మ కారకుడు)
రాశులు = 10వ రాశి అయిన
మకరరాశి
భావాలు =
10 వ భావం

ఓక వ్యక్తి జాతకంలో  రవి మరియు 9-10-11 భావము లేదా భావాధిపతులు బలంగా ఉండి
10 వ భావమునకు లేదా భావాధిపతికి
10 వ / 6 వ
, 11 వ మరియు 9 వ భావాలతోను,
రవి / శని / బృహస్పతి గ్రహాలతోను,
ధను / మకర
రాశులతోను ఏవిధముగా నైనా సంబంధం ఏర్పడినట్లైతే ఆవ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి బలమైన అవకాశం ఉంది అని చెప్పవచ్చు.

కేవలం 10వ భావాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోరాదు. ఆ వ్యక్తి జాతకంలోని మిగతా భావాలను, భావాధిపతులను సునిసితంగా పరిశీలించాలి. ఆజాతకునికి అర్హత సమగ్రంగా తెలుసుకోవడం కోసం ఇలాగే మనం మరికొన్ని భావాలను పరిశీలించాలి....
ధన విషయాల కోసం రెండో ఇంటిని
సర్వీస్ కోసం 6 వ
భావాన్ని
బాస్
, రిలేషన్షిప్, స్వీయ ఉపాధి, వ్యాపారం కోసం 7 వ ఇంటిని
పదవి కోసం 10 వ భావాన్ని
కోరికలు నెరవేర్చడానికి 11 వ
భావాన్ని ఆ భావాధిపతిని పరిశీలించాలి.
ఈ విధంగా పై భావాలన్నిటినీ పరిశీలించిన మీదట ఒక నిర్ణయానికి రావలసి ఉంటుంది.
ప్రస్తుతం త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కనుక, చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ పడ్డాయి. అందరూ ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి తమతమ అదృష్టాన్ని తెలుసుకోడానికి రంగంలోకి దిగుతున్నారు. ఈ సందర్భంలో నేను అందించే ఈవ్యాసం మీకు సహకరిస్తుందని భావిస్తున్నాను. ఒక్క విషయం గుర్తుంచుకోండి. అన్ని బలాలకన్నా సంకల్ప బలం గొప్పది. అటువంటి దృఢ సంకల్పం మీకుంటే, కాస్త తెలివిగా ఆలోచించి, దైవబలాన్ని కూడా తోడుతీసుకుని ముందుకు వెళ్లండి. అప్పుడు తప్పక జాబ్ పొంద గలుగుతారు. All the Best!!
మరిన్ని విశేషాలతో మళ్లీ కలుద్దాం!! జై శ్రీరామ్!!
R Vijay Sarma

1 comment:

  1. Everybody wants government job. How it is possible

    ReplyDelete